వడ్డీ రేట్లను తగ్గించిన 6 బ్యాంకులు, క్షుణ్ణంగా(టేబుల్)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఏడాది రెండు సార్లు వడ్డీ రేట్లను తగ్గించడంతో, బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లను తగ్గించగా, తాజాగా ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు సైతం వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించాయి.

గృహరుణాలపై వడ్డీ రేట్లను ఐసీఐసీఐ బ్యాంకు 0.25 శాతం తగ్గించింది. తగ్గించిన వడ్డీ రేట్లు మంగళవారం నుంచే అమల్లోకి బ్యాంకు తెలిపింది. ఇక మహిళలు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు గృహరుణాలపై వడ్డీ రేటుని 9.85 శాతంగా ఉంది. మిగిలిన వారికి 9.90 శాతం వడ్డీ వసూలు చేస్తుంది.
| Interest Rate Cut | Current Interest Rate on Home Loan | |
| ICICI Bank | 0.25% | 9.90% |
| State Bank of India | 0.25% | 9.90% |
| HDFC | 0.20% | 9.90% |
| Axis Bank | 0.20% | 9.95% |
| IndiaBulls | 0.25% | 9.90% |
| Dewan Housing | 0.20% | 9.90% |
ఇక గృహరుణాలపై వడ్డీ రేట్లను యాక్సిస్ బ్యాంకు 0.20 శాతం తగ్గించి 9.95 శాతంగా ఉంచింది. తగ్గించిన వడ్డీ రేట్లన్నీ మంగళవారం నుంచే అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. వీటితో పాటు ప్రైవేట్ హౌసింగ్ లోన్ సంస్థలు డిహెచ్‌ఎఫ్‌ఎల్, ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ కూడా వడ్డీరేట్లను వరసగా 0.25, 0.20 శాతం తగ్గించాయి.
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా గృహరుణాలపై వడ్డీరేటును 0.20 శాతం తగ్గించింది. ఇక ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీరేటును 0.25 శాతం వరకు తగ్గించింది. దీంతో మహిళలకు వర్తించే వార్షిక వడ్డీరేటు 10.10 శాతం నుంచి 9.85 శాతానికి తగ్గగా, మిగతావారికి వర్తించే వడ్డీరేటు 10.15 శాతం నుంచి 9.90 శాతానికి తగ్గింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా రెండు రోజుల క్రితమే గృహరుణం రేటును 0.20 శాతం తగ్గించింది. దీంతో సంస్థ వార్షిక వడ్డీరేటు 9.9 శాతానికి తగ్గింది. కొత్తగా లోన్ తీసుకునేవారితోపాటు గతంలో రుణం పొందినవారికి కూడా తగ్గింపు వర్తిస్తుందని ఒక ప్రకటనలో హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.


Click it and Unblock the Notifications