ఏజెంట్ కావాలంటే బీమా పరీక్ష నెగ్గాల్సిందే: ఐఆర్‌డీఏ

బీమా ఏజెంట్లుగా పనిచేయాల్సిన వారు ఇకపై తప్పనిసరిగా భారతీ బీమా నియంత్రణ మండలి (ఐఆర్‌డీఏ) నిర్వహిస్తున్న పరీక్ష ఖచ్చితంగా పాస్ కావాల్సి ఉంది. ఈ మేరకు బీమా ఏజెంట్ల నియామకాలు-2015 మార్గదర్శకాలు విడుదల చేసింది.

లైఫ్, జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన విభాగాల్లో పరీక్షల నిర్వహణ సంఘం నిర్వహించే 'ఇన్సూరెన్స్ ఏజెన్సీ' పరీక్షలో అభ్యర్ధులు ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయని ఐఆర్‌డీఏ ప్రకటించింది.

Pass exam to become agent: IRDA

దేశవ్యాప్తంగా నియమితులవుతున్న ఏజెంట్లకు ఈ సబ్జెక్ట్‌ల గురించి పెద్దగా అవగాహన ఉండటం లేదని గమనించిన నియంత్రణ మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీలు ప్రకటించే పాలసీల అనుమతి కోసం నిర్వహించే బోర్డు సమావేశాల గడువును మరింత పెంచింది.

ఒకవేళ జూన్‌లోపు బోర్డు తీర్మానాలు దాఖలు చేయని సంస్ధలు జులై 1 నుంచి ఏజెంట్లను నియమించుకోకుండా నిషేధిస్తామని ఐఆర్‌డీఏ హెచ్చరించింది. ఎస్ఏహెచ్‌ఐ మాత్రం జూన్ 30 వరకు ఐఐఐ పరీక్ష ఆధారంగా ఏజెంట్లను నియమించుకోవచ్చని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+