బెంగుళూరు: వచ్చే వారం, పది రోజుల్లో మీకు బ్యాంకులతో పని ఉందా.. అయితే వాటిని ఈరోజే చక్కబెట్టుకుంటే మంచిది. ఎందుకుంటే మార్చి 28 నుంచి ఏప్రిల్ మధ్య కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.
శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ ప్రేడే పండుగులతో పాటు వార్షిక ఖాతా ముగింపు వంటివి ఇందుకు కారణాలు. దీంతో స్టాక్ మార్కెట్, వాణిజ్య లావాదేవీలు, వేతనాల చెల్లింపు, ఎగుమతి-దిగుమతులకు సంబంధించిన ఆర్ధిక కార్యకలాపాలకు అవరోధం ఏర్పడుతుందని అసోచామ్ పేర్కొంది.
అంతే కాదు ఈ విషయంలో ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాలని, బ్యాంకులు కొన్ని ఏర్పాట్లు చేసుకునేలా ఆర్ధిక శాఖ సూచించాలని అసోచామ్ కోరింది. దీంతో ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీలు నిర్వహించే బ్యాంకుల బ్రాంచీలన్నీ ఈ నెల 30, 31 తేదీల్లో పూర్తిస్దాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

ఈ మేరకు రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకూ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం మార్చి 30న బ్యాంకులు పూర్తిరోజు పనిచేస్తాయి. 31వ తేదీన రాత్రి 8 గంటల వరకూ ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీల నిర్వహణకు కౌంటర్లు తెలిచి ఉంటాయి.
ఆర్దిక సంవత్సరం పూర్తి అయిన రోజే, ఆ ఏడాదికి సంబంధించిన ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీలన్నీ పూర్తికావడానికి వీలుగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కోంది. మార్చి 31వ తేదీ అర్ధరాత్రి వరకూ ఎలక్ట్రానిక్ లావాదేవీలు కొనసాగుతాయని తెలిపింది.
సెలవుల వివరాలు:
మార్చి 28 - శ్రీరామనవమి
మార్చి 29 - ఆదివారం
మార్చి 30 - పనిదినం
మార్చి 31, ఏప్రిల్ 1 - వార్షిక ఖాతాల ముగింపు
ఏప్రిల్ 2 - మహావీర్ జయంతి
ఏప్రిల్ 3 - గుడ్ ప్రైడే
ఏప్రిల్ 4 (శనివారం) - సగం రోజు మాత్రమే
ఏప్రిల్ 5- ఆదివారం
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications