మహిళల సంపాదన ఎక్కువ భాగం ఇంటికే...!
దుబాయ్: మార్చి 21 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఇతర దేశాలకు వలస వెళ్లిన మహిళలు-ఆర్థిక ప్రభావం' అనే అంశంపై డబ్బును బదిలీ చేసే సర్వీస్ ప్రొవైడర్లలో ప్రధానమైన వెస్ట్రన్ యూనియన్ సంస్థ అధ్యయనాన్ని నిర్వహించింది.
ఈ అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలను ఆ సంస్ధ ప్రెసిడెంట్ జీన్ క్లాడ్ ఫరా వెల్లడించారు. ఏ దేశంలో పనిచేస్తున్నా తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని రెమిటెన్స్‌ల రూపంలో మహిళలే ఎక్కువగా ఇంటికి పంపుతున్నట్లు తెలిపారు.
అంతే కాదు పురుషులతో పాటు సమానంగా అన్నిరంగాల్లో దూసుకుపోతున్నా కుటుంబ బాధ్యతలను ఏ మాత్రం విస్మరించడం లేదన్నారు. కొత్త అవకాశాల కోసం దేశ సరిహద్దులను దాటి ప్రయాణించినా ఇంటి అవసరాలను తీర్చడంలో ప్రధానపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

అధ్యయనంలోని ముఖ్యాంశాలు:
* గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన మహిళలతో చాలామంది తల్లులు లేదా తల్లిదండ్రులకు చేయూతనిచ్చేందుకు వచ్చినవారే.
* ప్రపంచవ్యాప్తంగా డబ్బును బదిలీ చేయడంలో మహిళల సంఖ్య పెరుగుతోంది.
* గ్లోబల్ ఎకానమీ అభివృద్ధిలో పాలుపంచుకుంటూనే కుటుంబ ఆర్థిక అవసరాలను తీరుస్తూ కీలకపాత్ర పోషిస్తున్నారు.
* ముఖ్యంగా పురుషులుగానీ, స్త్రీలు గానీ డబ్బు పంపుతున్నది ఎక్కువ భాగం మహిళలకే(డబ్బును అందుకుంటున్న వారిలో మూడింట రెండొంతులు వారే).
* ఇంటి ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో మహిళలు ఎంత కీలకమో తెలుస్తోంది.
* విదేశాలకు వలస వెళ్లిన 48 శాతం మంది మహిళలు ఉద్యోగాలు చేయడంగానీ, సొంత వ్యాపారాలు గానీ నిర్వహిస్తున్నారు.
* విదేశాల నుంచి పురుషులు పంపుతున్న డబ్బుకు సమానంగా మహిళలు కూడా పంపుతున్నారు.
* బ్యాంకు ఖాతాల్లో తక్కువగా ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో మహిళలు 13.4 శాతం పంపిస్తుండగా, పురుషులకు 15.6 శాతం ఇంటికి పంపిస్తున్నారు.
* మగవారి కన్నా తక్కువగా సంపాదిస్తున్నప్పటికీ సంపాదనలో ఎక్కువ భాగాన్ని స్వదేశంలో ఉన్న తమ కుటుంబాలకు పంపుతున్నారు.


Click it and Unblock the Notifications