భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో సుమారు USD 26 బిలియన్ల విలువ బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు పార్లమెంట్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు గాను లిఖిత పూర్వకంగా ఆర్ధిక శాఖ మంత్రి జయంత్ సిన్హా సమాధానమిచ్చారు.
2014-15 ఆర్ధిక సంవత్సర ఏప్రిల్-డిసెంబర్ కాలంలో భారతదేశం 664.29 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న పేర్కొన్నారు. ఈ బంగారం విలువ USD 26 బిలియన్లు. అదే విధంగా 38.11 టన్నుల బంగారాన్ని 9వ నెలలో ఎగుమతి చేసినట్లు పేర్కొన్నారు. వీటి విలువ USD 1.55 బిలియన్.
దీంతో పాటు సిన్హా మాట్లాడుతూ ఫిబ్రవరి 18న రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా స్టార్ అండ్ ప్రీమియం ట్రేడింగ్ హౌస్‌లకు ఎలాంటి ఆంక్షలు లేకుండా బంగారాన్ని దిగుమితి చేసుకునేందుకు అనుమతిని ఇచ్చిందని అన్నారు. మరో ప్రశ్నకు గాను జమ్స్ అండ్ జ్యూయలరీ ఎక్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రాతినిధ్యం వహిస్తూ ఏబీఎన్ ఆమ్రో బ్యాంకు లైసెన్స్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు.