న్యూఢిల్లీ: సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒక ఫామ్ నింపటంతో పాటు, ఇవ్వాల్సిన మొత్తానికి చెక్ రాసివాల్సి ఉంటుంది. అదే సంస్ధ ఆఫర్ చేస్తున్న మరో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఇంకో ఫామ్ నింపి, మరో చెక్ ఇవ్వాలి.
ఇలాంటి ఒకే సంస్ధలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ సింగిల్ విండో ద్వారా లావాదేవీల ప్లాట్‌ఫారాన్ని ‘మ్యూచువల్ ఫండ్ యుటిలిటీ' '(ఎంఎఫ్‌యూ) పేరిట నిర్వహించవచ్చు.
దీంతో సంస్థలకు చెందిన ఎన్ని ఫండ్లలో పెట్టుబడి పెట్టినా, ప్రత్యేకించి ఫామ్‌లు, చెక్కులు నింపాల్సిన అవసరం లేదు. ఎంఎఫ్‌యూ ద్వారా జరిగే లావాదేవీలన్నీ ప్రాసెసింగ్ కోసం అసెట్ మేనేజిమెంట్ కంపెనీలు, లేక రిజిష్ట్రార్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లకు వెళతాయి.

‘మ్యూచువల్ ఫండ్ యుటిలిటీ'ని మీరు ఉపయోగించాలంటే మీకు ‘కామన్ అకౌంట్ నంబర్' (క్యాన్) ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫామ్‌ను నింపి ఇవ్వటం ద్వారా ఏఎంఎఫ్ ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూటర్ దగ్గరైనా పొందవచ్చు. దీని ద్వారా ఆ వ్యక్తులు 24 గంటల్లో ఎప్పుడైనా తమ మ్యూచువల్ ఫండ్ స్టేట్‌మెంట్లను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.
దీంతో పాటు మీ పెట్టుబడులను సమర్థంగా నిర్వహించుకోవటానికి వీలుగా అలెర్ట్‌లు, ట్రిగ్గర్‌లు, రిమైండర్ల లాంటి విలువ ఆధారిత సేవలూ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 25 ఏఎంసీ కంపెనీలు ఈ ఎంఎఫ్‌యూను వినియోగించుకోవటానికి అంగీకరించాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications