బెంగుళూరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం కీలక వడ్డీ రేట్లను తగ్గించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. నగదు నిలువల నిష్పత్తిని యథాతథంగా ఉంచింది.
దీంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు నెలల వ్యవధిలో రేపోరేటు తగ్గించడం ఇది రెండోసారి. వడ్డీ రేట్లను తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం భారత స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
ఆర్‌బీఐ వడ్డీ రేటు తగ్గింపుతో ఆర్ధిక వ్వవస్ధ బలోపేతం అవుతుందని కేంద్ర మంత్రి జయంత్ సిన్హా అన్నారు. ఆర్‌బీఐ నిర్ణయంతో ఈఎంఐలు తగ్గుతాయని పేర్కొన్నారు.

కొత్త పెట్టుబడులు వెల్లువెత్తడంతో, మార్కెట్ లాభాల్లో పయనిస్తుంది. బుధవారం నాటి సెషన్ ఆరంభంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడి 30,00వేల పాయింట్ల మైలురాయిని దాటింది.
మరో వైపు నిఫ్టీ సైతం 80 పాయింట్లకు పైగా లాభపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్‌లోని కంపెనీలన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో పాటు టీసీఎస్, మారుతి, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్ టెల్ సంస్ధల షేర్లు లాభాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications