మన దేశంలో డబ్బున్న వారు మరింత డబ్బున్న వారిగా కావడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ పేదవాడు కోటీశ్వరుడు కావడం కష్టమా? అంటే ఏ మాత్రం కాదనే అంటున్నారు నిపుణులు. అయితే కోటీశ్వరుడు కావాలంటే కొన్ని స్వీయ నిబంధనలు, పెట్టుబడి వ్యూహాలు ఉండాలి.
దూరదృష్టి ఉండాలి?
కోటీశ్వరులు కావాలనుకునే వారికి ముఖ్యంగా దూరదృష్టి ఉండాలి. 5, 10 ఏళ్ల తర్వాత అప్పటి అవసరాలేమిటి? వాటిని సాధించడానికి ఇప్పటి నుంచే ఏం చేయాలి అని ఆలోచిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తనకు బాబు పుట్టుగానే ఆమె భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నెలకు రూ. 5 వేల చొప్పున 13 శాతం రాబడి వచ్చేలా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాడనుకుందాం.
18ఏళ్ల తర్వాత దాదాపు రూ. 39, 64, 000లు పొందే అవకాశం ఉంది. అంటే, బాబు ఉన్నత చదువుల కోసం ఏ మాత్రం ఆర్ధికంగా ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా చేయని పక్షంలో మీ బాబు ఉన్నత చదువుల కోసం ఆర్ధికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

మీ బాబు ఉన్నత చదువుల కోసం రూ. 40 లక్షలు అప్పు చేశారనుకుందాం. దీనికి చెల్లించేందుకు బ్యాంకులకు నెలకు రూ. 73 వేలు చొప్పున ఏడేళ్ల పాటు కట్టాల్సి ఉంటుంది. ఇలా అప్పు తీర్చుకుంటూ వెళితే, ఎప్పటికీ మీరు కోటీశ్వరుడు కాలేరు.
మీ మీద మీకు నమ్మకం:
మీరు గనుక కోటీశ్వరుడు కావాలంటే మొట్టమొదట మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నేను కూడా ధనవంతుడిని కావాలనే కోరిక ఉన్నవారే ఆ కోరికకు తగ్గ ప్రణాళికలను వేసుకుంటారు. 'పేదలుగా పుట్టాం... ధనవంతులమ్యే అవకాశం మాకు లేదు' అని అనుకోవడం వల్లే చాలా మంది పేదవారిగా మిగిలిపోతున్నారంటాడు బ్రియాన్ ట్రేసీ.
కలలు కనండి... వాటిని ఆచరణలో పెట్టండి:
కలలు అందరూ కంటుంటారు. కానీ కొంతమంది మాత్రమే వాటిని నెరవేర్చుకుంటారు. ఉదాహరణకు అపార్ట్‌మెంట్ కోనుగోలు చేయాలనే కలను కనండి. అప్పుడు ఆ కోరిక తీరేందుకు కావాల్సిన ప్రణాళికలను వేసుకుంటారు. ఇరవయేళ్ల తర్వాత మీ దగ్గర రెండు కోట్లు ఉండాలంటే 19 ఏళ్ల తర్వాత ఎంత ఉండాలి? ఏం చేయాలి? ఇలా భవిష్యత్తు నుంచి ప్రస్తుత కాలానికి మీ ప్రణాళికలను రాసుకుంటూ రావాలి.
చిన్న చిన్న పెట్టుబడులు మొదలు పెట్టండి:
చిన్న చిన్న పెట్టుబడులను పెట్టడంతో పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టవచ్చు. నెలకు రూ. 1000లు కూడా 40 ఏళ్ల తర్వాత మిమ్మల్ని కోటీశ్వరలుగా మారుస్తాయి. అయితే చాలా మంది చిన్న మొత్తాలను పొదుపు చేసేందుకు అయిష్టం చూపిస్తారు.
ఒక వ్యక్తి 15 ఏళ్ల వయసు నుంచి నెలకు రూ. 500 చొప్పున 14 శాతం వార్షిక వృద్ధి అందించే మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేశాడనుకుంటే, అతనికి 60 ఏళ్లు నిండగానే అతని దగ్గర రూ. కోటీ అరవై లక్షలదాగా నిధి సమకూరుతుంది.
గమనిక: తక్కువ కాలంలో కోటీశ్వరుడు కావాలనుకునే వారు సాహసం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం గాను అధిక వృద్ధికి అవకాశం ఉండే షేర్ మార్కెట్ వైపు దృష్టి సారిస్తే మంచిది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications