అజయ్‌కు ఓ ప్రముఖ కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆపాయింట్‌మెంట్ లెటర్‌లో కంపెనీ ఇచ్చిన మొత్తం వేతనాన్ని చూసుకుని సంతోషంగా ఉన్నాడు. అయితే మొదటి నెల జీతం తీసుకున్న తర్వాత కొంచెం నిరాశకు గురయ్యాడు.
అపాయింట్ మెంట్ లెటర్‌లో కంపెనీ ప్రకటించిన జీతంతో పోల్చితే తక్కువగా అందుకోవడమే ఇందుకు కారణం. అయితే ఈ వేతన విషయంలో కంపెనీని నిందించకూడదు. ఎందుకంటే కంపనీ ప్రకటించిన మొత్తం వేతనంలో సిటిసి అనేది తెలియక పోవడం వల్లే ఈ సమస్య.
కాస్ట్ టు కంపెనీ(కంపెనీలకు ఖర్చులు) అంటే ఏమిటి?
కాస్ట్ టు కంపెనీ అంటే కంపెనీ మీపైన భరించే ఖర్చులు. ఇందులో మీ ప్రావిడెంట్ ఫండ్‌తో మొత్తం లెక్కింపుగా ఉంటుంది. కాబట్టి, మీరు కంపెనీతో వేతన విషయంపై చర్చించే సమయంలో ఇంటికి తీసుకొచ్చే జీతం(టేక్ హోం శాలరీ) విషయంలో మీయొక్క ఇన్‌కమ్ ట్యాక్స్, ప్రావిడెంట్ ఫండ్ తదితర అంశాలపై ఆధాపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

మీ స్థూల జీతం లేదా సీటీసీ నుండి ఏయే తగ్గింపులు ఉంటాయో తెలుసుకోండి?
ఉదాహరణకు అజయ్ వేతనాన్ని తీసుకోండి.
మూలవేతనం - రూ. 300,000
హౌస్ అలవెన్సు - రూ. 60,000
మెడికల్ పరిహారం - రూ. 15000
కన్వేయన్స్ అలవెన్స్ - రూ. 8000
సంవత్సరానికి మొత్తం స్థూల జీతం - రూ. 3,83,000 (నెల జీతం రూ 31.917)
ఏయే తగ్గింపులు:
ప్రాథమిక మరియు HRA మీద పన్ను మొత్తం - రూ. 11,000
ఈపీఎఫ్ (బేసిక్ జీతం 12%) - రూ. 36,000
వైద్య బీమా - రూ. 4000
వృత్తి పన్ను - రూ. 3600
నికర జీతం = రు 3,39,400 (నెల జీతం రూ 28.283)
పైన పేర్కొన్న ఉదాహరణను బట్టి కంపెనీ చెల్లించే సీటీసీ గురించి ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. కాబట్టి ఏదైనా కంపెనీ ఇంటర్యూలో మీరు సెలక్టైన తర్వాత హెచ్‌ఆర్‌తో మీ జాబ్ ఆఫర్ గురించి క్షుణ్ణంగా మాట్లాడండి.


Click it and Unblock the Notifications