మొబైల్ ఫోన్‌లో ఐసిఐసిఐ కొత్త అప్లికేషన్ ‘పాకెట్స్’
News
oi-Nageshwara
By Nageswara Rao
న్యూఢిల్లీ: భారతదేశపు అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ ‘పాకెట్స్' పేరుతో కొత్త అప్లికేషన్‌ను ప్రారంభించింది. పేమెంట్ బ్యాంకుల నుంచి పోటీని తట్టుకునేందుకు ఐసీఐసీఐ బ్యాంకు డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసును ప్రారంభించనట్లు వెల్లడించింది. ‘పాకెట్స్' అప్లికేషన్‌ను జేబులో బ్యాంకుగా అభివర్ణించింది.
దీని సాయంతో వినియోగదారులు ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నెంబర్ లేదా ఫేస్‌బుక్ లేదా వేరే ఇతర బ్యాంకు ఖాతాకైనా క్షణాల్లో నిధులు బదిలీ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఈ వాలెట్ అప్లికేషన్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్ లౌడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వేరే ఇతర బ్యాంకు ఖాతాల నుంచైనా ఈ వాలెట్ లోకి నిధులు పంపించి ఆ క్షణం నుంచి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఈ వాలెట్ లావాదేవీల కోసం వర్చువల్ వీసా కార్డును బ్యాంకు అందిస్తుంది. వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా లావాదేవీలు నిర్వహించేందుకు ఈ వాలెట్ సహాయపడుతుంది.
ఆ తర్వాత వినియోగదారులు ఫిజికల్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వాలెట్‌కు జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాను కూడా జత చేసుకునే సదుపాయాన్ని ఐసీఐసీఐ బ్యాంకు కల్పిస్తోంది. ఈ వాలెట్‌లో డిపాజిట్ చేసి ఉపోయోగించుకోకుండా ఉంటే ఆ సొమ్ముపై వడ్డీ కూడా చెల్లిస్తారు.