కిసాన్ వికాస్ పాత్ర(కెవిపి)లో పెట్టుబడి పెట్టొచ్చా?
బెంగుళూరు: గత ఏడాది ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కిసాన్ వికాస్ పాత్ర(కెవిపి)ను పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చిన్న పొత్తాల పొదుపు పథకం వల్ల నల్ల ధనాన్ని వైట్ మనీగా మార్చుకుంటున్నారని ఆరోపణలు రావడంతో 2011లో నిలుపుదల చేశారు.
1980ల్లో ప్రారంభించిన ఈ పథకంలో వడ్డీ రేటు ఐదు సంవత్సరాల ఆరు నెలల్లో రెట్టింపు అవుతుంది. మళ్లీ తిరిగి 2014లో ఈ పథకాన్ని పునఃప్రారంభించడానికి గల ముఖ్య కారణం ఈ పథకం ద్వారా వచ్చిన నగదుని కిసాన్ వికాస్ పాత్ర ఉత్పత్తుల్లో ఉపయోగించనున్నారు.
బంగారం, వెండి లాంటి వాటిల్లో డబ్బు పెట్టుబడులు పెట్టకుండా కూడా అరికట్టేందుకు ఇది ఉపయోపడుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ బ్యాంకుల్లో ఈ కిసాన్ వికాస్ పాత్ర అకౌంట్‌ను తెరవొచ్చు. కిసాన్ వికాస్ పాత్రను అందిస్తున్న బ్యాంకులు ఏవేంటో ఈ క్రింద చూద్దాం.

1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా
3) పంజాబ్ నేషనల్ బ్యాంక్
4) బ్యాంక్ ఆఫ్ బరోడా
5) స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ అండ్ జైపూర్
6) స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా
7) అలహాబాద్ బ్యాంక్
8) ఆంధ్రా బ్యాంక్
9) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
10) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
11) కార్పొరేషన్ బ్యాంక్
12) దేనా బ్యాంక్
13) ఇండియన్ బ్యాంక్
14) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
15) యూకో బ్యాంక్
16) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
17) ఐడిబిఐ బ్యాంక్
18) ఐసిఐసిఐ బ్యాంక్
కిసాన్ వికాస్ పాత్ర అకౌంట్‌లో వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
కిసాన్ వికాస్ పాత్రలో ఓపెన్ చేసిన అకౌంట్లకు ఏడాదికి 8.67 చొప్పున వడ్డీ రేటు అందిస్తుంది. 8 సంవత్సరాల 4 నెలల్లో ఈ అకౌంట్‌లోని నగదు రెట్టింపు అవుతుంది. పీపీఎఫ్ అకౌంట్లలో కూడా మీకు ఇంతకు మించే ఎక్కువ వడ్డీ వస్తుంది. కిసాన్ వికాస్ పాత్ర మీరు పొందే వడ్డీ రేటుని పన్ను ఆదా కింద ఫైల్ చేయలేరు.
కిసాన్ వికాస్ పాత్రలో పెట్టుబడి పెట్టొచ్చా?
కిసాన్ వికాస్ పాత్రలోని పెట్టుబడులకు ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రయోజనాలు ఉండవు. ఏమంత అత్యధిక వడ్డీ రేటుని కూడా అందించవు. కిసాన్ వికాస్ పాత్ర కంటే బయట ఇంకా ఎక్కువ వడ్డీని అందించి, పన్ను ఆదా ప్రయోజనాలు పొందే పథకాలు చాలానే ఉన్నాయి.
దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్నప్పడు మాత్రమే ఈ కిసాన్ వికాస్ పాత్ర లాంటి పథకాలు మంచివి. ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిసాన్ వికాస్ పాత్ర లాంటి పథకాల్లో జరుగుతున్న లావాదేవీలపై రిపోర్ట్ చేయాల్సిందిగా బ్యాంకలను కోరాయి.


Click it and Unblock the Notifications