మీ తప్పు లేకున్నా.. కొత్త ఏటీఎం కార్డుకి ఛార్జ్ ఎందుకు?

బెంగుళూరు: మనం ఎలాంటి తప్పిదాలు చేయకపోయినా... కొన్ని సందర్భాల్లో బ్యాంకులు మన వద్ద నుంచి చార్జీని వసూలు చేస్తున్నాయి. ఉదారహణకు మనం ఏటీఎం నుంచి నగదు డ్రా చేసే సందర్బంలో తగినంత నగదు ఏటీఎం మిషన్ లేకపోయినా, వేరే బ్యాంకుకు చెందిన ఏటీఎంను నగదు తీసేందుకు ఉపయోగించినప్పుడు మన లావాదేవీని నియంత్రించడం(decline transaction) చూస్తూనే ఉన్నాం.

పైన పేర్కొన్న రెండు సందర్భాల్లో మన తప్పిదం లేకపోయినా బ్యాంకులు మన వద్ద నుంచి చార్జీని వసూలు చేస్తున్నాయి. పైన పేర్కొన్న ఛార్జీలు ఏటీఎం వాడకం నెలకు ఐదు సార్లకు మించితేనే బ్యాంకులు వసూలు చేస్తాయన్న సంగతిని గుర్తు పెట్టుకోవాల్సి ఉంది.

Why Do Banks Charge for New ATM Card When Card Is Captured Due to ATM Problem?

దీంతో పాటు మీ అకౌంట్‌లో తగినన్ని నిధులు ఉన్నా... లేవంటూ మరొక బ్యాంక్ ఎటీఎం మిషన్‌ను ఉపయోగించినందుకు చార్జీని వసూలు చేస్తారు. సాధారణంగా కొన్ని ఏటీఎం మిషన్స్‌లో రూ. వెయ్యి, మరి కొన్ని ఏటీఎం మిషన్స్‌లో రూ. ఐదొందులు నోట్లను ప్రత్యేకించి ఉంచడం జరుగుతుంది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఏటీఎమ్ నుంచి నగదు వచ్చిన తర్వాత కూడా కార్డుని మిషన్‌ లోపలే ఉంటుంది.

ఈ ఇలాంటి సందర్భాల్లో మీ తప్పిదం లేకపోయినా, మీరు కొత్త ఏటీఎమ్ కార్డుకి దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంకు మీ వద్ద నుంచి ఛార్జీని వసూలు చేస్తుంది. మిషన్ చేసిన తప్పిదానికి మీరు చార్జీ రూపంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి చాలా సందర్భాలు బ్యాంకు వినియోగదారుడు తన తప్పిదం లేకపోయినా, బ్యాంకులు చార్జీని వసూలు చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+