అపార్ట్‌మెంట్ కొనుగోలు: సరైన బిల్డర్ ఎంచుకోవడం ఎలా?
న్యూఢిల్లీ: ఏదైనా మంచి అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేయాలని అనుకంటున్నారా? దేశంలో ఇబ్బడిముబ్బడిగా ఉన్న బిల్డర్స్‌లో ఏ బిల్డర్ సరిగ్గా మీ అభిరుచులకు, ఆలోచనలకు సరిపోతారో తెలుసుకోవడం ఎలా? దీనికి సంబంధించిన కొన్ని సూచనలు మీకోసం ప్రత్యేకంగా...
రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మంది పెట్టుబడిదారులు పెట్టబడులు పెట్టి నష్టాలను చవిచూసినవారున్నారు. మంచి బిల్డర్ నుంచి సరైన అపార్ట్ మెంట్ కోనుగోలు చేయడం ఇంటికి కూరగాయాలు తెచ్చినంత ఈజీ కాదు. మీరు గనుక సరైన బిల్డర్‌ను ఎంచుకోక పోతే మీ జీవితాంతం సంపాదించిన డబ్బు పొగొట్టుకోవాల్సి వస్తుంది.
* గతంలో బిల్డర్ ట్రాక్ రికార్డుని పరిశీలించాలి
బిల్డర్ గురించి ప్రాధమిక విచారణ చేయండి. గతంలో ఆ బిల్డర్ పూర్తి చేసిన ప్రాజెక్టులను పరిశీలించండి. ప్రస్తుతం ఆ అపార్ట్ మెంట్స్‌లో ఉంటున్న వారి వద్దకు వెళ్లి మాట్లాడి బిల్డర్ గురించి తెలుసుకుంటే ఇంకా మంచింది. కొంత మంది బిల్డర్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు సమయంలో చాలా వగ్ధానాలిచ్చి అంచనాలను చేరుకోలేరు.

* అనుమతించబడిన బిల్డరా కాదా తెలుసుకోండి
రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరుపడితే వారు ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటారు. కానీ మీరు కొనుగోలు చేయాలనుకున్న అపార్ట్‌మెంట్ బిల్డర్ అసలు ప్రభుత్వం చేత గుర్తింపు పొందబడిన బిల్డర్ అవునా కాదా తెలుసుకోండి. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో బిల్డర్‌కి సభ్యత్వం ఉందా అని ప్రశ్నించండి.
* పొందాల్సిన అథారిటీ నుండి సరైన అనుమతులు
అపార్ట్‌మెంట్ నిర్మించాలని బిల్డర్ అనుకున్న తరుణంలో ప్రభుత్వం వైపు అన్ని వర్గాల నుంచి అనుమతులు పొందాడా లేదా అనే విషయం అడిగి మరీ తెలుసుకోండి. ఉదాహారణకు హైదరాబాద్ లో అపార్ట్‌మెంట్ నిర్మించదలచుకున్న బిల్డర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ నుంచి అన్ని అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది.
* ధరలను సరిపోల్చండి
బిల్డర్‌తో ముందుగా అగ్రిమెంట్ కుదుర్చుకునే ముందు పూర్తిగా అన్నింటి గురించి మాట్లాడుకుని సంతకం చేస్తే మంచిది. మీరు అపార్ట్‌మెంట్ కొనుగోలు చేస్తున్న ఏరియాలో మిగతా బిల్డర్స్ ధరలను కూడా ముందుగానే తెలుసుకుంటే మంచిది.
* గృహరుణం ఇచ్చే బ్యాంకులు
అపార్ట్‌మెంట్ కొనుగోలుకి మందు ఏయే బ్యాంకులు మీకు లోను సదుపాయాన్ని కల్పిస్తున్నాయో బిల్డర్‌ను అడిగి తెలుసుకోండి. దేశీయ ప్రభుత్వ బ్యాంకులు మీ ప్రాజెక్టుకు లోను సదుపాయం కల్పిస్తుంటే మీ పని మరితం సులువు అవుతుంది.


Click it and Unblock the Notifications