For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిబ్రవరి 20లోగా డీల్ పూర్తి, సుబ్రతా రాయ్‌కి బెయిల్..?(ఫోటోలు)

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతా రాయ్‌ని జైలు నుంచి బెయిలుపై విడిపించేందుకు కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. సుమారు రూ. 12,000 కోట్ల మేర పెట్టుబడులు, రుణానికి సంబంధించి మిరాచ్ క్యాపిటల్ గ్రూప్‌తో డీల్ ఫిబ్రవరి 20లోగా పూర్తి కాగలదని సహారా గ్రూప్ కార్పొరేట్ ఫైనాన్స్ విభాగం హెడ్ సందీప్ వాధ్వా తెలిపారు.

ఈ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. 200 కోట్ల డాలర్లలో 110 కోట్ల డాలర్లు పెట్టుబడుల రూపంలో, 88 కోట్ల డాలర్లను సీనియర్‌ లోన్‌ రూపంలో తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ లోన్‌ కాలపరిమితి ఒక ఏడాది పాటు ఉంటుందని వెల్లడించారు.

సుబ్రతా రాయ్‌కి బెయిల్..?

సుబ్రతా రాయ్‌కి బెయిల్..?

సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతా రాయ్‌ని జైలు నుంచి బెయిలుపై విడిపించేందుకు కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. సుమారు రూ. 12,000 కోట్ల మేర పెట్టుబడులు, రుణానికి సంబంధించి మిరాచ్ క్యాపిటల్ గ్రూప్‌తో డీల్ ఫిబ్రవరి 20లోగా పూర్తి కాగలదని సహారా గ్రూప్ కార్పొరేట్ ఫైనాన్స్ విభాగం హెడ్ సందీప్ వాధ్వా తెలిపారు.

సుబ్రతా రాయ్‌కి బెయిల్..?

సుబ్రతా రాయ్‌కి బెయిల్..?

ఈ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. 200 కోట్ల డాలర్లలో 110 కోట్ల డాలర్లు పెట్టుబడుల రూపంలో, 88.2 కోట్ల డాలర్లను సీనియర్‌ లోన్‌ రూపంలో తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ లోన్‌ కాలపరిమితి ఒక ఏడాది ఉంటుందని వెల్లడించారు.

సుబ్రతా రాయ్‌కి బెయిల్..?

సుబ్రతా రాయ్‌కి బెయిల్..?

సహారా గ్రూప్‌కు విదేశాల్లో ఉన్న మూడు హోటల్స్‌కు సంబంధించి బ్యాంక్‌ ఆఫ్‌ చైనాలో తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు ఈ లోన్‌ను వినియోగిస్తామని తెలిపారు. సహారాకు చెందిన అనుబంధ సంస్థ ఆంబీ వ్యాలీ లిమిటెడ్‌ ద్వారా లండన్‌లోని గ్రాస్‌వీనర్‌ హౌజ్‌ హోటల్‌లో 65 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని వాధ్వా తెలిపారు.

 సుబ్రతా రాయ్‌కి బెయిల్..?

సుబ్రతా రాయ్‌కి బెయిల్..?

ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన డిపాజిట్లపై 20,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించడంలో సుబ్రతా రాయ్ విఫలమయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయన 9 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు. సుబ్రతా రాయ్‌ను బెయిలు మీద విడిపించాలంటే 10,000 కోట్ల రూపాయలు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సహారా గ్రూప్ నిధుల సమీకరణ యత్నాలు చేస్తోంది.

సహారా గ్రూప్‌కు విదేశాల్లో ఉన్న మూడు హోటల్స్‌కు సంబంధించి బ్యాంక్‌ ఆఫ్‌ చైనాలో తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు ఈ లోన్‌ను వినియోగిస్తామని తెలిపారు. సహారాకు చెందిన అనుబంధ సంస్థ ఆంబీ వ్యాలీ లిమిటెడ్‌ ద్వారా లండన్‌లోని గ్రాస్‌వీనర్‌ హౌజ్‌ హోటల్‌లో 65 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని అన్నారు.

ఆతిథ్య రంగంలోని సహారా వ్యాపారాల్లో మిరాక్‌ క్యాపిటల్‌ గ్రూప్‌ 45 కోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతుందని చెప్పారు. ఈ నిధులను స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ద్వారా సహారా వ్యాపారాల్లోకి మళ్లిస్తామని అన్నారు. ఈ ఒప్పందం విధివిధానాల గురించి రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతులు పొందామని, అవసరమైతే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్ నుంచి కూడా అనుమతులు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన డిపాజిట్లపై 20,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించడంలో సుబ్రతా రాయ్ విఫలమయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయన 9 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు. సుబ్రతా రాయ్‌ను బెయిలు మీద విడిపించాలంటే 10,000 కోట్ల రూపాయలు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సహారా గ్రూప్ నిధుల సమీకరణ యత్నాలు చేస్తోంది.

English summary

ఫిబ్రవరి 20లోగా డీల్ పూర్తి, సుబ్రతా రాయ్‌కి బెయిల్..?(ఫోటోలు) | Sahara Group close to $2 billion deal with Mirach Capital

Sahara Group's Head of Corporate Finance Sandeep Wadhwa told PTI that documentation process is progressing and the deal with Mirach Capital is expected to be completed before February 20.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X