న్యూయార్క్/న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన మొబైల్ మార్కెటింగ్ సంస్థ ‘జిప్ డయల్'ను సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కొనుగోలు చేసింది. దాదాపు 30 మిలియన్ డాలర్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని జిప్ డయల్ తన వెబ్సైట్, ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్లడించింది.
ట్విట్టర్ ఇండియా కూడా తన ఖాతాలో ఈ ఒప్పందం గురించి ట్వీట్ చేసింది. దేశ వ్యాప్తంగా ప్రజలతో మరింత అందుబాటులో ఉండేందుకు జిప్ డయల్‌ను సొంతం చేసుకున్నామని ట్విట్టర్ పేర్కొంది.

బెంగళూరుకు చెందిన జిప్ డయల్ మార్కెటింగ్ ప్రచారం కోసం తమ క్లయింట్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లను సేకరిస్తుంది. దీంతో వినియోగదారులు కొన్ని నెంబర్లకు కాల్ చేయగా, కనెక్ట్ అయ్యే ముందు కాల్ హ్యాంగ్ అవుతుంది. అంటే మిస్డ్ కాల్ వస్తే సరిపోతుంది.
తర్వాత వారికి కావాల్సిన సమాచారానికి సంబంధించిన సమాధానం ప్రమోషన్ రూపంలో ఉన్న టెక్స్ట్ మెసేజ్ ద్వారా వెళ్తుంది. జిప్ డయల్ క్లైంట్లలో యునీలీవర్, డిస్నీ, జిల్లెట్, అమెజాన్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: యాపిల్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. కానీ ఈ టెక్కీ ఆటో ఎందుకు నడుపుతున్నాడో తెలుసా?

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

ఒకప్పుడు మ్యాగీ తింటూ గడిపాడు! నేడు నెలకు రూ. 3.5 లక్షల సంపాదిస్తున్నాడు!

Bengaluru: బెంగళూరులో రూ. 500తో రోజంతా గడపడం సాధ్యమేనా? ఈ యువతి ఏం చేసిందో చూడండి!

Vande Bharat: బెంగళూరు టూ ముంబై వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది! రూట్ మ్యాప్ ఇదే!

Bengaluru: రోడ్లు చూస్తే గుంతలు.. బడ్జెట్ చూస్తే వేల కోట్లు! అసలు డబ్బు అంతా ఎటు వెళ్తోంది?

Bengaluru: ఇన్వెస్టర్లకు పండగే: బెంగళూరులోని ఈ ప్రాంతాల్లో ఆస్తుల విలువ భారీగా జంప్!

Bengaluru: బిజినెస్ చేయాలని ఉన్నా ధైర్యం సరిపోవట్లేదా? మీరు కూడా ఈ ట్రాప్‌లో ఉన్నారేమో చూసుకోండి!

Bengaluru: బెంగళూరు వాసులకు అలర్ట్! మధ్యాహ్నం బయటకు రావొద్దు.. క్లినిక్‌లకు క్యూ కడుతున్న బాధితులు!



Click it and Unblock the Notifications