ట్విట్టర్ ద్వారా ఐసీఐసీఐ నగదు బదిలీ (ఫోటోలు)
ముంబై: దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులకు ట్విట్టర్ ద్వారా నగదు బదిలీ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. దీంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవడం, ప్రీ పెయిడ్ మొబైల్ రీచార్జ్ కూడా చేసుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సభర్వాల్ చెప్పారు.
కస్టమర్లు ఈ సౌకర్యాన్ని పొందాలంటే తమ ట్విట్టర్ హ్యాండ్లర్‌ను నమోదు చేసుకోవాలని అన్నారు. నగదు పంపించే వ్యక్తి, అవతలి వ్యక్తి ట్విట్టర్ హ్యాండ్లర్ తప్పక తెలిసి ఉండాలని పేర్కొన్నారు. నగదు బదిలీ లావాదేవీలు నిర్వహించిన అనంతరం నగదును పంపించిన వ్యక్తికి యునిక్ కోడ్‌తో కూడిన ఒక ఎస్ఎంఎస్ వస్తుందని, నగదు పొందే వ్యక్తి ఈ కోడ్‌ను స్పెషల్ వెబ్ పేజీలో ఎంటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు.
నగదు బదిలీకి ప్రస్తుతం ఎన్‌ఈఎఫ్‌టీ(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్), ఆర్‌టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) విధానాలను ఉపయోగిస్తున్నామని, త్వరలో ఐఎంపీఎస్(ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్)ను ఉపయోగించనున్నట్లు తెలిపారు.
ట్విట్టర్ ద్వారా చేసే నగదు బదిలీకి ఎలాంటి చార్జీలు ఉండవని, ఎన్‌ఈఎఫ్‌టీ(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్), ఆర్‌టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్)లకు ఛార్జీలు వర్తిస్తాయని అన్నారు. నగదు పొందే వ్యక్తి వేరే బ్యాంక్ ఖాతాదారు అయి ఉంటే, ఆ బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పనిసరిగా కోట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ట్విట్టర్ ద్వారా ఐసీఐసీఐ నగదు బదిలీ
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులకు ట్విట్టర్ ద్వారా నగదు బదిలీ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. దీంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవడం, ప్రీ పెయిడ్ మొబైల్ రీచార్జ్ కూడా చేసుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సభర్వాల్ చెప్పారు.

ట్విట్టర్ ద్వారా ఐసీఐసీఐ నగదు బదిలీ
కస్టమర్లు ఈ సౌకర్యాన్ని పొందాలంటే తమ ట్విట్టర్ హ్యాండ్లర్‌ను నమోదు చేసుకోవాలని అన్నారు. నగదు పంపించే వ్యక్తి, అవతలి వ్యక్తి ట్విట్టర్ హ్యాండ్లర్ తప్పక తెలిసి ఉండాలని పేర్కొన్నారు. నగదు బదిలీ లావాదేవీలు నిర్వహించిన అనంతరం నగదును పంపించిన వ్యక్తికి యునిక్ కోడ్‌తో కూడిన ఒక ఎస్ఎంఎస్ వస్తుందని, నగదు పొందే వ్యక్తి ఈ కోడ్‌ను స్పెషల్ వెబ్ పేజీలో ఎంటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు.

ట్విట్టర్ ద్వారా ఐసీఐసీఐ నగదు బదిలీ
ట్విట్టర్ ద్వారా నగదు బదిలీ చేసుకునే సౌకర్యాన్ని అందించిన తొలి ఆసియా బ్యాంక్ తమదేనని, అలాగే ప్రపంచంలో రెండవదని పేర్కొన్నారు. గతేడాది ఫేస్‌బుక్ ద్వారా నగదు బదిలీ సౌకర్యాన్ని అందించామని చెప్పారు. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకుకు 30వేలకు పైగా యాక్టివ్ ఫేస్‌బుక్ వినియోగదారులున్నారని తెలిపారు.

ట్విట్టర్ ద్వారా ఐసీఐసీఐ నగదు బదిలీ
మొబైల్ బ్యాంకింగ్ కోసం 2.8 మిలియన్ ఖాతాదారులు రిజస్టర్ అయ్యారని, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను 15 మిలియన్ ఖాతాదారులు వాడుతున్నారని పేర్కొన్నారు. ఐసీఐసీఐ బ్యాంకులో ప్రత్యేకించి 100మందితో కూడిన టీమ్ డిజిటల్ బ్యాంకింగ్‌పై పని చేస్తున్నట్లు చెప్పారు.

Click it and Unblock the Notifications