ఎత్తుకు తగ్గట్లుగా.. మహీంద్రా కొత్త గస్టో(పిక్చర్స్)
హైదరాబాద్: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ద్విచక్ర వాహన విభాగంలో గస్టో పేరుతో కొత్త స్కూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. తొలిసారిగా టూవీలర్ సెగ్మెంట్‌లో ఎత్తుకు తగ్గట్టుగా సీట్‌ను సరిచేసుకొనే ఫీచర్‌తో వస్తున్న గస్టో రెండు వేరియంట్లలో లభించనుంది.
గస్టో హెచ్‌ఎక్స్ ధరను రాష్ట్ర మార్కెట్లో రూ.48,100గా నిర్ణయించారు. రిమోట్ ఫ్లిప్ కీతో వచ్చే గస్టో వీఎక్స్ రూ.50,100కు లభించనుంది. ఇటాలియన్ స్టైస్టెలింగ్, 110 సీసీ సామర్థ్యంతో కూడిన ఎంటెక్ ఇంజిన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ స్కూటర్‌కు ఫ్రంట్ కిక్, ఫైండ్ మీ ల్యాంప్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది.
అల్యూమినియం ఇంజిన్‌తో రూపొందించిన గస్టో లీటరు పెట్రోల్‌కు 63 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని సంస్థ పేర్కొంది. గురువారం గస్టోను హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా మహీంద్రా టూవీలర్స్ సేల్స్ విభాగ వైస్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. గతంలోనే కంపెనీ ప్రకటించిన 300 సీసీ మోటార్‌బైక్ మోజోను మరో 4-6 నెలల్లో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం హై ఎండ్ బైక్ మార్కెట్లో ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా ఈ బైక్‌కు మెరుగులు దిద్దుతున్నట్లు చెప్పారు. దక్షిణాది మార్కట్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కీలకమైనవని చెప్పారు. కార్యక్రమంలో మహీంద్ర టూ వీలర్స్ జోనల్ బిజినెస్ మేనేజర్ తిరుపతి రావు పాల్గొన్నారు.

మహీంద్రా గస్టో
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ద్విచక్ర వాహన విభాగంలో గస్టో పేరుతో కొత్త స్కూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

మహీంద్రా గస్టో
తొలిసారిగా టూవీలర్ సెగ్మెంట్‌లో ఎత్తుకు తగ్గట్టుగా సీట్‌ను సరిచేసుకొనే ఫీచర్‌తో వస్తున్న గస్టో రెండు వేరియంట్లలో లభించనుంది.

మహీంద్రా గస్టో
గస్టో హెచ్‌ఎక్స్ ధరను రాష్ట్ర మార్కెట్లో రూ.48,100గా నిర్ణయించారు. రిమోట్ ఫ్లిప్ కీతో వచ్చే గస్టో వీఎక్స్ రూ.50,100కు లభించనుంది.

మహీంద్రా గస్టో
ఇటాలియన్ స్టైస్టెలింగ్, 110 సీసీ సామర్థ్యంతో కూడిన ఎంటెక్ ఇంజిన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ స్కూటర్‌కు ఫ్రంట్ కిక్, ఫైండ్ మీ ల్యాంప్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది.


Click it and Unblock the Notifications