ఐసీఐసీఐ మరో వినూత్న ప్రయోగం: కాంటాక్ట్ లెస్ క్రెడిట్, డెబిట్ కార్డులు
ముంబై: దేశీయ ప్రైవేట్ బ్యాంకుల్లో అగ్రస్దానంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు తొలిసారిగా కాంటాక్ట్ లెస్ క్రెడిట్, డెబిట్ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డులు, ఎక్స్‌ప్రెషన్స్ వేవ్ డెబిట్ కార్డులు నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీతో పనిచేస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఈ కార్డులను స్వైప్ చేయకుండానే, కదిలిస్తే చెల్లింపులు జరిగిపోతాయని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సబర్వాల్ చెప్పారు. ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీ వల్ల లావాదేవీలు వేగంగా జరుగుతాయని, పైగా అత్యంత సురక్షితం అని పేర్కొన్నారు. ఈ కాంటాక్ట్ లెస్ కార్డులను మొదటగా హైదరాబాద్, ముంబై, గుర్గావ్‌లో ప్రవేశపెట్టామని అన్నారు.
ఈ కార్డుల కోసం ఆయా నగరాల్లో 1,200 పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) మెషీన్లను ఏర్పాటు చేశామని వివరించారు. వేరే ఇతర నగరాల్లో మామూలు డెబిట్, క్రెడిట్ కార్డు మాదిరిగానే ఉపయోగించుకోవచ్చని తెలిపారు. భారత్‌లో ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్‌లను తొలిసారి కస్టమర్లకు పరిచయం చేసిన ఘనత మాకే దక్కుతుందని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications