పీఎఫ్ ఖాతాదారుల కోసం చౌకగా గృహాలందించే పథకం
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ఓకు దేశ్ వ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది ఖాతాదారులకు చౌకగా గృహాలందించే ఉద్దేశ్యంతో కేంద్ర కార్మిక శాక ప్రణాళికను తయారుచేయనుంది. 2022లోగా అందరికీ గృహాలందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కార్మిక శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలుస్తోంది.
ఈ పథకం కోసం పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్‌బీసీసీ వంటి ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థలతోపాటు హుడా, పుడా, డీడీఏ వంటి అధికార సంస్థలతోనూ కార్మిక శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఖాతాదారుల్లో 70 శాతం మంది కనీస వేతనం రూ. 15 వేల లోపు కలిగి ఉన్నవారే. ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన పీఎఫ్ ఖాతాదారుల కోసం కార్మిక శాఖ ఈ పథకం రూపొందిస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
సొంత నిధులతో పీఎఫ్ ఖాతాదారులకు చౌక గృహాలను అందిచాలని ఇటీవలే ఈపీఎఫ్ఓను ప్రధాని కార్యాలయం కోరింది. సంస్ధ నిధుల్లో 15 శాతం ఇందు కోసం వెచ్చించడం వల్ల వ్వవస్ధలోకి రూ. 70 వేల కోట్ల మేరక ద్రవ్యం అందుబాటులోకి వస్తుందని, దీని ద్వారా మరో 3.5 లక్షల చౌక గృహాలను నిర్మించేందుకు వీలవుతుందని ప్రధాని కార్యాలయం పేర్కొంది.
ప్రస్తుతం ఈఫీఎఫ్ఓ వద్ద రూ 6.5 లక్షల కోట్ల మేర కార్పస్ నిధులున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధన ప్రకారం ఐదు సంవత్సరాలు పాటు సంస్ధ పథకంలో కొనసాగిన తర్వాతే పీఎఫ్ డిపాజిట్లను విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చౌక గృహ పథకాల ప్రయోజనాలు పొందేందుకు వీలుగా తక్కువ ఆదాయం ఉన్న ఖాతాదారులకు సబ్సిడీ సౌకర్యం కల్పించాలని కార్మిక శాఖ ఆలోచనగా ఉంది. ఆదాయ కేటగిరీని బట్టి ఖాతాదారులకు గృహాలు, ప్రోత్సహకాలను అందించనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications