న్యూఢిల్లీ: ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ భారత్ ఫోర్జ్.. ఫ్రాన్స్‌కు చెందిన మెకానిక్ జనరల్ లాంగ్రోయిస్ (ఎంజీఎల్) అనే సంస్థను 1.18 కోట్ల యూరోలకు (రూ.90 కోట్లు) కొనుగోలు చేసింది. జర్మనీ అనుబంధ వ్యాపార సంస్థ సీడీపీ భారత్ ఫోర్జ్ జిఎంబిహెచ్ ద్వారా ఎంజీఎల్‌లో 100 శాతం వాటా తీసుకున్నట్లు స్టాక్‌మార్కెట్లకు భారత్ ఫోర్జ్ తెలిపింది.
ఈ డీల్‌తో సంస్థ టర్న్‌కీ సొల్యుషన్స్ సేవలు మరింత మెరుగుపడటంతోపాటు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్‌కు సంబంధించిన ఉత్పత్తుల విభాగంలో సామర్థ్యం పెంచుకునేందుకు అవకాశం లభిస్తుందని సంస్థ పేర్కొంది.
హైదరాబాద్ అమూల్ ప్యాకెట్ పాలు

హైదరాబాద్: అమూల్ బ్రాండ్ ప్యాకెట్ పాలు హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం సంస్థ ప్రతినిధులు ఇక్కడి మార్కెట్‌కు పరిచయం చేశారు. అమూల్ బ్రాండ్ గుజరాత్ కోఆపరేషన్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) పాలను ఉత్పత్తి చేస్తుండగా, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 1 కోటి లీటర్ల పాలను విక్రయిస్తున్నట్లు అమూల్ ఓ ప్రకటనలో తెలియజేసింది.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని 70 లక్షల మంది వినియోగదారులకూ తమ పాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా, హైదరాబాద్‌లో ప్యాకెట్ పాలతోపాటు ప్యాకెట్ పెరుగును కూడా విక్రయించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్‌ఎస్ సోధీ తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో తమ ఉత్పత్తులు వినియోగదారులకి లభిస్తాయన్నారు.
హైదరాబాద్ పాల ఉత్పత్తుల మార్కెట్‌లో 20 శాతం వాటాను సాధించాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. అమూల్ టోన్డ్ పాలు లీటర్ ధర 38 రూపాయలైతే, గోల్ ఫుల్ క్రీమ్ పాలు లీటర్ 50 రూపాయలని వివరించారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications