న్యూఢిల్లీ: కోల్ ఇండియా సీఎండీగా సీనియర్ ఏఐఎస్ అధికారి ఎస్ భట్టాచార్య నియమితులయ్యారు. ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్. దీనికి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా భట్టాచార్య నియమితులయ్యారు. గత ఆరు నెలలుగా కోల్ ఇండియా సిఎండి పదవి ఖాళీగా ఉంది.
రెండు రోజుల క్రితం కోల్ ఇండియా సిఎండిగా ఎస్ భట్టాచార్యను కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదించినట్లు ఓ ఉన్నతాధికారి బుధవారం తెలిపారు. నియామక ఆదేశాలు కూడా సిద్ధమయ్యాయని చెప్పారు. దీంతో ఈ ఏడాది జూన్ 26 నుంచి కోల్ ఇండియా సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి ఎకె దూబే స్థానంలో భట్టాచార్య బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐఎఎస్ అధికారి నర్సింగరావు ఈ ఏడాది మే నెలలో రాజీనామా చేయడంతో కోల్ ఇండియా సిఎండి పదవి ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో కొత్త సిఎండి అనే్వషణ మొదలవగా, 12 మందికి జరిపిన ఇంటర్వ్యూలో 1985 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి ఎస్ భట్టాచార్యను కోల్ ఇండియా సిఎండి పదవికి గత వారం పిఇఎస్‌బి సిఫార్సు చేసింది. ప్రస్తుతం భట్టాచార్య సింగరేణి కాలరీస్ కంపెనీ సిఎండిగా ఉన్నారు.
2019 కల్లా వంద కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని కోల్ ఇండియా భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరేందుకు తగిన వ్యూహాలను రచించేందుకు కొత్త సీఎండీ నియామకం దోహదం చేయనుందని భావిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications