న్యూఢిల్లీ: దేశీయ సిమెంట్ రంగంలో అతిపెద్ద డీల్ జరిగింది. ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్ సంస్థ.. జైప్రకాశ్ అసోసియేట్స్‌కు (జేఏఎల్) మధ్యప్రదేశ్‌లో ఉన్న రెండు సిమెంట్ ప్లాంట్లను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ రూ.5,400 కోట్లు.
జేపీ అసోసియేట్స్‌కు బేలాలో ఉన్న ప్లాంట్ ఏటా 21 లక్షల టన్నుల క్లింకర్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు 26 లక్షల టన్నుల సిమెంట్ గ్రైండ్ చేయగలదు. సిధిలో ఉన్న మరో ప్లాంటు వార్షిక క్లింకర్ సామర్థ్యం 31 లక్షల టన్నులు.

కాగా.. 23 లక్షల టన్నుల సిమెంట్ గ్రైండింగ్ సామర్ద్యం కలిగిన యూనిట్లతో పాటు 180 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లను జేఏఎల్ నుంచి కొనుగోలు చేసేందుకు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని దేశంలోనే అతి పెద్ద సిమెంట్ తయారీ సంస్ధ అల్ట్రాటెక్ మంగళవారం వెల్లడించింది.
ఈ డీల్‌తో సంస్థ ఉత్పత్తి సామర్థ్యం మరో 49 లక్షల టన్నుల మేర పెరుగనుందని అల్ట్రాటెక్ సిమెంట్ తెలిపింది. ప్రస్తుతం అల్ట్రాటెక్ వార్షిక సిమెంట్ తయారీ సామర్ధ్యం 6 కోట్ల టన్నులు కాగా, ఈ కోనుగోలు అనంతరం 6.5 కోట్లకు చేరనుంది.
అప్పులతో ఇబ్బంది పడుతున్న జైప్రకాశ్ అసోసియేట్స్‌కు ఇంకా 2.2 కోట్ల టన్నుల సిమెంట్ తయారీ సామర్ధ్యం ఉంది. రుణ మొత్తాన్ని తగ్గించుకునేందుకు సిమెంట్, విద్యుత్త యూనిట్లను విక్రయిస్తున్నట్లు సంస్ధ తెలిపింది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications