సినీ నటి రెజీనా చేతుల మీదగా "లక్కీ" ప్రారంభం (ఫోటోలు)

విశాఖపట్నం: గోపాలపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిధిగా పాల్గొని షాపింగ్ మాల్‌ను ప్రారంభించగా, క్యాష్ కౌంటరును సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, ఓ ఫ్లోర్‌ని ఎమ్మెల్యే పెతకం శెట్టి గణబాబు ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన సినీ నటి, హీరోయిన్ రెజీనా మరో ఫ్లోర్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫ్యాషన్ ప్రపంచంలో అన్ని రకాల వస్త్రాలను ఒకే చోట అందించడంలో "లక్కీ" ముందుంటుదన్నారు. ఈ సందర్భంగా మాల్ యజమానులు రత్తయ్య, స్వామి, శ్రీను మంత్రికి అప్పన్న చిత్రపటాన్ని బహుకరించారు.

Actress Regina inaugurates Lucky Shopping mall at Visakhapatnam

షాపింగ్ మాల్‌లోని అన్ని ఫ్లోర్‌లలో వస్త్రాలను నటి రెజీనా పరిశీలించారు. అనంతరం రెజీనా మాట్లాడుతూ పండుగ సమయంలో మంచి షాపింగ్ మాల్ గోపాలపట్నం పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇక్కడి వస్త్రాల్లోని ప్రతి డిజైన ప్రత్యేకత కలిగి ఉంటాయన్నారు.

Actress Regina inaugurates Lucky Shopping mall at Visakhapatnam

ఇక ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, పెతకం శెట్టి గణబాబు, పల్లా శ్రీనివాస్‌లు మాట్లాడుతూ వినియోగదారులకు ఈ షాపింగ్ మాల్ లక్కీ అని అన్నారు. ఇక్కడ షాపింగ్ చేస్తే గంటల కొద్దీ సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు.

షాపింగ్ మాల్ అధినేత రత్తయ్య మాట్లాడుతూ, గోపాలపట్నం పరిసర ప్రాంత ప్రజలకు సరికొత్త షాపింగ్ అనుభూతిని తమ సంస్ధ మిగులుస్తొందన్నారు. అనేక ఆఫర్లు లక్కీలో అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+