బ్రిటిష్ బ్యాంక్ చైర్ పర్సన్‌గా భారత సంతతి మహిళ శృతి

లండన్: బ్రిటన్‌లోని బ్యాంకింగ్‌ దిగ్గజం సాంటాండర్‌ చైర్ పర్సన్‌గా భారత సంతతికి చెందిన శ్రుతి వదేరా నియమితులయ్యారు. దీంతో బ్రిటన్‌లో ఒక భారీ బ్యాంకుకు సారథ్యం వహిస్తున్న మొట్టమొదటి మహిళగా ఆమెకు గౌరవం దక్కింది.

అలాగే, లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో అత్యధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ గల ఎఫ్‌టిఎస్‌టి 100 సంస్థల్లో మహిళా సారథ్యంలో నడుస్తున్న మూడో సంస్థగా సాంటాండర్‌కు, చైర్ పర్సన్‌ శ్రుతి వదేరాకు అరుదైన గుర్తింపు లభించింది. ఈమె గతంలో బ్రిటన్‌ ఆర్థిక శాఖలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Indian-origin Shriti Vadera to chair British bank Santander UK

ఈ ఏడాది జనవరిలో జాయింట్‌ డిప్యూటీ చైర్మన్‌ హోదాలో శ్రుతి సాంటాండర్‌ యుకె కంపెనీ బోర్డులో చేరారు. 2007-2009 మధ్య కాలంలో కేబినెట్‌ కార్యాలయంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ యుబిఎస్‌లో 14 ఏళ్ల పాటు వివిధ స్థాయిల్లో పని చేశారు.

యూరో జోన్‌ ఆర్థిక సంక్షోభం సమయంలో బ్రిటిష్‌ మాజీ ప్రధాని గోర్డాన్‌ బ్రౌన్‌కు యుకె ట్రెజరీ సలహాదారుగా ఎనిమిదేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. యూకే, ఇతర అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై ఆమె అవగాహన, బ్యాంకింగ్‌ రంగంలో తన నైపుణ్యం సాంటాండర్‌ బ్యాంకు నిర్వహణకు ఉపయోగపడతాయని బ్యాంకో సాంటాంటర్‌ గ్రూప్‌ చైర్‌ పర్సన్‌ అనా బొతిన్‌ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+