ముంబై: పెట్టుబడి మాంత్రీకుడిగా పేరున్న రాకేష్ ఝున్‌జున్‌వాలా అంచనాలు ఇప్పుడు తప్పాయి! ఆయన ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టినా ఆ షేర్లు పెరుగుతుంటాయి. కానీ స్పైస్ జెట్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఈయన పెట్టుబడి పెట్టిన తర్వాత 12 రోజుల్లో 12 శాతం దాకా నష్టపోయాయి ఆ కంపెనీ షేర్లు.
స్పైస్ జెట్ క్రైసిస్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని షేర్లు పతనం అయ్యాయి. రాకేష్ ఝున్‌జున్‌వాలా రేర్ ఎంటర్ ప్రైజెస్ అధిపతి. ఈయన నవంబర్ 28న బహిరంగ మార్కెట్లో స్పైస్ జెట్‌కు చెందిన 75 లక్షల షేర్లను రూ.13.4 కోట్లతో కొనుగోలు చేశారు.

ఇది కంపెనీలో 1.4 శాతం వాటాకు సమానం. అప్పటికే కంపెనీ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు మరీ అధ్వాన్నమైంది. 1800కు పైగా విమాన సర్వీసులను ఒక్క ఈ నెలలోనే రద్దు చేశారు. నవంబర్ 28 నుండి జరిగిన 12 ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు ధర 12.5 శాతం క్షీణించింది. మంగళవారం 2.62 శాతం పెరిగింది.
ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న దేశీయ విమానయాన సంస్ధ స్పైస్‌జెట్.. ఈ నెలాఖరు వరకు దేశ్యాప్తంగా అన్ని మార్గాల్లో నడిచే 1861 విమాన సర్వీసులను రద్దు చేసింది. సన్‌గ్రూపు అధినేత కళానిధి మారన్‌కు చెందిన ఈ విమానయాన సంస్ధకు ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువయ్యాయని కొత్త నిర్ణయం సంకేతాలిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
అడ్వాన్స్ బుకింగ్‌లకు సంబంధించి ఆదేశాలను బేఖాతరు చేసినందున సంస్థకు డీజీసీఏ షోకాజు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తొంది. మంగళవారం నుంచి నెలరోజులకు పైబడి అడ్వాన్స్ బుకింగ్‌లను స్వీకరించరాదని సంస్థను డీజీసీఏ ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications