
క్రోమ్‌కాస్ట్ ధర 2,999 రూపాయలు. 2012లో 90 కంపెనీలతో జిఔస్‌ఎఫ్‌ను ప్రారంభించగా, ఈ ఏడాది ఫెస్టివల్‌లో పాల్గొంటున్న కంపెనీల సంఖ్య 450కి పెరిగిందని గూగుల్ ఇండియా ఎండి రాజన్ ఆనందన్ చెప్పారు. ఆన్‌లైన్ షాపింగ్ పట్ల వినియోగదారుల్లో విశ్వాసం పెరుగుతోందని, గత కొద్ది వారాల నుంచి 50 లక్షల వినియోగదారులు జిఔస్‌ఎఫ్ సైట్‌ను సందర్శించారని వెల్లడించారు.
2016 నాటికి దేశంలో ఆన్‌లైన్ షాపర్ల సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని ఆనందన్ తెలిపారు. నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో మాత్రమే లభ్యమవుతుందని గూగుల్ తెలి పింది. క్రోమ్‌కాస్ట్ విక్రయాల కోసం భారతి ఎయిర్‌టెల్, స్నాప్‌డీల్‌తో గూగుల్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది.
ప్రస్తుతం ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు వినియోగించుకుంటున్న వారు క్రోమ్‌కాస్ట్ కొనుగోలు చేయడం ద్వారా 3 నెలల పాటు 60 జిబి డేటాకు యాక్సెస్ కావచ్చని గూగుల్ తెలిపింది.
కొత్త వినియోగదారులకు కూడా ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని, ఉచితంగా కొత్త బ్రాడ్‌బ్యాండ్ సేవలు యాక్టివేట్ చేస్తామని వెల్లడించింది. టాటా హౌజింగ్ కూడా జిఔస్‌ఎఫ్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించింది. 150 కోట్ల రూపాయల వ్యయంతో బెంగళూరులో నిర్మిస్తున్న లగ్జరీ గృహాల సముదాయాన్ని ఆన్‌లైన్ ఫెస్టివల్‌లో విక్రయిస్తామని పేర్కొంది.
ఐదు ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 75 ఇండిపెండెంట్ గృహాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న మరో ఏడు ప్రాజెక్టులను కూడా జిఓస్‌ఎఫ్‌లో విక్రయిస్తామని వివరించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications