న్యూఢిల్లీ: ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న దేశీయ విమానయాన సంస్ధ స్పైస్‌జెట్.. ఈనెలాఖరు వరకు దేశ్యాప్తంగా అన్ని మార్గాల్లో నడిచే 1861 విమాన సర్వీసులను రద్దు చేసింది. సన్‌గ్రూపు అధినేత కళానిధి మారన్‌కు చెందిన ఈ విమానయాన సంస్ధకు ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువయ్యాయని కొత్త నిర్ణయం సంకేతాలిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
అడ్వాన్స్ బుకింగ్‌లకు సంబంధించి ఆదేశాలను బేఖాతరు చేసినందున సంస్థకు డీజీసీఏ షోకాజు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తొంది. మంగళవారం నుంచి నెలరోజులకు పైబడి అడ్వాన్స్ బుకింగ్‌లను స్వీకరించరాదని సంస్థను డీజీసీఏ ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే.

మరోవైపు రూ.200 కోట్ల బకాయిలకు బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించలేకపోతే సంస్థ నుంచి ఎప్పటికప్పుడే విమానాశ్రయ సర్వీసు చార్జీలను వసూలు చేయాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) యోచిస్తుంది.
స్పైస్‌జెట్ ఎయిర్ లైన్‌కు కేటాయించిన 186 స్లాట్స్‌ను శుక్రవారం డీజీసీఏ వెనక్కి తీసుకుంది. రాబోయే 10 రోజుల్లో ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలను చెల్లించాలని కోరింది. చూస్తుంటే రెండేండ్ల క్రితం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఎదురైన పరిస్థితులు గుర్తుకొస్తున్నాయని, చివరికి కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌లాగే ఈ సంస్థ కూడా మూతపడే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications