జనవరి 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎమ్ ఛార్జీలు పెంపు
హైదరాబాద్: దేశీయ అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎమ్ ఛార్జీలను పెంచనుంది. జనవరి 1 నుంచి పెరిగిన ఏటీఎమ్ ఛార్జీలను ఐసీఐసీఐ బ్యాంకు అమలు చేయనుంది. సేవింగ్స్ ఖాతాదారులకు ఏటీఎమ్‌లలో ఐదు లావాదేవీల తర్వాత రూ. 20 రుసుం వసూలు చేయనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తన వెబ్ సైట్‌లో పేర్కొంది.
దేశంలోని ఐదు మెట్రో ప్రాంతాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత్తా, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్న ఇతర బ్యాంకుల ఏటీఎమ్‌లలో 3 ఉచిత లావాదేవీలు, మెట్రోయేతర ప్రాంతాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎమ్‌లలో 5 ఉచిత లావాదేవీలకు అవకాశం కల్పిస్తున్నట్లు బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది.

ఏటీఎమ్ కార్డును ఐదు సార్లు వినియోగంలో డబ్బులు విత్ డ్రా, బ్యాలెన్స్ ఎంక్వయిరీ లాంటి వాటికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. నిర్వహణ వ్యయం పెరిగిపోతోందన్న బ్యాంకుల డిమాండ్ల మేరకు సొంత బ్యాంకుల్లో ఉచిత ఏటీఎం లావాదేవీలను నెలకు 5కు, ఇతర బాంకుల విషయలో 3కు పరిమతం చేసేందుకు ఆర్‌బీఐ బ్యాంకులకు అనుమతించిన విషయం తెలిసిందే.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 1 నుంచే ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చినట్లు సమాచారం. యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు జనవరి 1 నుంచి అమలు చేయనున్నాయి. బ్యాలెన్స్ ఎంక్వయిరీ, మినీ స్టేట్‌మెంట్ వంటివాటికి రూ.8.5 చొప్పున(పన్నులు కాకుండా) వసూలు చేస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ కూడా ఏటీఎం నగదు లావాదేవీలపై రూ.20 చొప్పున, ఇతర లావాదేవీలపై రూ.9.5 చొప్పున వసూలు చేయనుంది.


Click it and Unblock the Notifications