మార్కెట్లోకి ఐషర్ స్కైలైన్ ప్రొ సిరీస్ బస్సులు(ఫోటోలు)
న్యూఢిల్లీ: విఈ కమర్షియల్ వెహికల్స్ (విఇసివి) ఐషర్ స్కైలైన్ ప్రొ సిరీస్‌లో సరికొత్త బస్సులను మార్కెట్లోకి విడుదల చేసింది. స్కూలు విద్యార్ధులు, ఎగ్జిక్యూటివ్‌ల కోసం ప్రత్యేకంగా ఈ బస్సులను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. శుక్రవారం నాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో విఇసివి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ మల్లర్ ఈ బస్సులను విడుదల చేశారు.
రవాణా సామర్థ్యాలను మెరుగుపరిచే విధంగా కొత్త తరం ఐషర్ స్కైలైన్ ప్రొ సిరీస్ బస్సులను అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. ప్రొడక్టివిటీని పెంచటమే కాకుండా రవాణా వ్యయాలను గణనీయంగా తగ్గిస్తాయని ఆయన తెలిపారు.
1996లో తొలి సేఫ్ స్కూల్ బస్‌ను ఐషర్ మార్కెట్లోకి తీసుకువచ్చిందని దీనికే మరికొన్ని ఫీచర్లను చేర్చి విద్యార్ధుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.
ప్రస్తుతం లో - మిడ్ సైజ్ బస్ విభాగంలో కంపెనీ మార్కెట్ వాటా 15.7 శాతంగా ఉందని మల్లర్ వెల్లడించారు. ఈ రెండు కొత్త బస్సుల చేరికతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ వాటా మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు మల్లర్ చెప్పారు.

మార్కెట్లోకి ఐషర్ స్కైలైన్ ప్రొ సిరీస్ బస్సులు
విఈ కమర్షియల్ వెహికల్స్ (విఇసివి) ఐషర్ స్కైలైన్ ప్రొ సిరీస్‌లో సరికొత్త బస్సులను మార్కెట్లోకి విడుదల చేసింది.
మార్కెట్లోకి ఐషర్ స్కైలైన్ ప్రొ సిరీస్ బస్సులు
స్కూలు విద్యార్ధులు, ఎగ్జిక్యూటివ్‌ల కోసం ప్రత్యేకంగా ఈ బస్సులను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

మార్కెట్లోకి ఐషర్ స్కైలైన్ ప్రొ సిరీస్ బస్సులు
శుక్రవారం నాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో విఇసివి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ మల్లర్ ఈ బస్సులను విడుదల చేశారు.
మార్కెట్లోకి ఐషర్ స్కైలైన్ ప్రొ సిరీస్ బస్సులు
రవాణా సామర్థ్యాలను మెరుగుపరిచే విధంగా కొత్త తరం ఐషర్ స్కైలైన్ ప్రొ సిరీస్ బస్సులను అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. ప్రొడక్టివిటీని పెంచటమే కాకుండా రవాణా వ్యయాలను గణనీయంగా తగ్గిస్తాయని ఆయన తెలిపారు.

మార్కెట్లోకి ఐషర్ స్కైలైన్ ప్రొ సిరీస్ బస్సులు
1996లో తొలి సేఫ్ స్కూల్ బస్‌ను ఐషర్ మార్కెట్లోకి తీసుకువచ్చిందని దీనికే మరికొన్ని ఫీచర్లను చేర్చి విద్యార్ధుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.

మార్కెట్లోకి ఐషర్ స్కైలైన్ ప్రొ సిరీస్ బస్సులు
ప్రస్తుతం లో - మిడ్ సైజ్ బస్ విభాగంలో కంపెనీ మార్కెట్ వాటా 15.7 శాతంగా ఉందని మల్లర్ వెల్లడించారు. ఈ రెండు కొత్త బస్సుల చేరికతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ వాటా మరింత పెరుగుతుందన్నారు.

Click it and Unblock the Notifications