ఇక క్యాంపస్ కొలువులు కష్టమే: క్రిసిల్

ఆదాయంలో 13 శాంత వార్షిక వృద్ధి లభించినా, ఖర్చులను తగ్గించుకునేందుకు నియామకాలపై ఐటీ సంస్ధలు ఆచితూచి వ్యవహరిస్తాయని తెలిపింది. రూ. 7 లక్షల కోట్ల స్ధాయికి చేరిన దేశీయ ఐటీ రంగంలో ప్రస్తుతం 31 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
2002-2014 సంవత్సరాల మధ్య సంస్ధల ఆదాయం 18 శాతం, కొత్త నియామకాలు 15 శాతం పెరుగుతూ వచ్చాయి. ఎక్కువ మంది నిపుణుల్లో నాల్గవ వంతు మంది ఐటీలోనే ఉన్నారు. ప్రస్తుతం అత్యధికంగా ఉపాధి కల్పించే రంగాల్లో ఐటీ రంగం కీలకంగా మారింది.
ఐతే ఐటీ కోసం ఖాతాదారుల పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే కాలంలో ఐటీ సంస్ధల ఆదాయంలో ఆరోగ్యవంతమైన వృధ్ది లభిస్తుందని క్రిసిల్ వెల్లడించింది. ఐతే కొత్త నియామకాలు మాత్రం 2017-18 ఆర్ధిక సంవత్సరానికి ఇప్పటితో పోలిస్తే సగానికి తగ్గిపోతాయని తెలిపింది.
అంతర్జాతీయంగా ఆర్ధిక మందగమనం కొనసాగడం వల్లే ఖాతాదారులు ఐటీపై ఖర్చును తగ్గిస్తారని క్రిసిల్ అభిప్రాయపడింది. దీంతో ఐటీ కంపెనీలు లాభదాయకతను కొనసాగించేందుకు, ఖర్చులను అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపింది.
క్యాంపస్ నియామకాలు తగ్గిస్తున్నా... ఆయా రంగాల్లో నైపుణ్యం, అనుభవం కలిగిన వారికి మాత్రం ఐటీ కంపెనీలు అవకాశం కల్పిస్తాయని క్రిసిల్ తెలిపింది. రాబోయే కాలంలో ఐటీ రంగంలో ఉద్యోగం కోరుకునేవారు ఎక్కువ, సరికొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సి ఉందని పేర్కొంది.


Click it and Unblock the Notifications