భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య(ఫోటోలు)
న్యూఢిల్లీ: భారతదేశంలో స్మార్ట్ సిటీలు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, 2022నాటికల్లా అందరికీ ఇళ్లు వంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు శనివారం సింగపూర్ పారిశ్రామిక వేత్తలు, నిర్మాణ రంగ సంస్థలకు పిలుపు నిచ్చారు.
నిధులతో పాటు పరిశ్రమలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. గతంలో లేనంత సులభంగా భారత్‌లో తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రధానమంత్రి పిలుపునిచ్చిన మేక్ ఇండియాను ఉపయోగించుకోవాలని సూచించారు.
సింగపూర్ పర్యటనలో భాగంగా వెంకయ్య నాయుడు నిర్మాణ రంగం, విద్యుత్, ఎలక్ర్టానిక్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ సర్వీసులు, షిప్పింగ్, చమురు, గ్యాస్ తదితర రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
సింగపూర్‌లో భారత హైకమిషనర్ విజయా ఠాకూర్ సింగ్, పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సింగపూర్ జాతీయాభివృద్ది మంత్రి డెస్మండ్ లీ, ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి ఈశ్వరన్‌లతో వెంకయ్య చర్చలు జరిపారు.

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
భారతదేశంలో స్మార్ట్ సిటీలు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, 2022నాటికల్లా అందరికీ ఇళ్లు వంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు శనివారం సింగపూర్ పారిశ్రామిక వేత్తలు, నిర్మాణ రంగ సంస్థలకు పిలుపు నిచ్చారు.

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
నిధులతో పాటు పరిశ్రమలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. గతంలో లేనంత సులభంగా భారత్‌లో తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రధానమంత్రి పిలుపునిచ్చిన మేక్ ఇండియాను ఉపయోగించుకోవాలని సూచించారు.

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
సింగపూర్ పర్యటనలో భాగంగా వెంకయ్య నాయుడు నిర్మాణ రంగం, విద్యుత్, ఎలక్ర్టానిక్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ సర్వీసులు, షిప్పింగ్, చమురు, గ్యాస్ తదితర రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు.

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
సింగపూర్‌లో భారత హైకమిషనర్ విజయా ఠాకూర్ సింగ్, పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
సింగపూర్ జాతీయాభివృద్ది మంత్రి డెస్మండ్ లీ, ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి ఈశ్వరన్‌లతో వెంకయ్య చర్చలు జరిపారు.

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: వెంకయ్య
భారత సంతతికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా వెంకయ్య పాల్గొని ప్రభుత్వ పథకాలు, ప్రధానమంత్రి ఆలోచనా విధానం గురించి వివరించారు.
భారత సంతతికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా వెంకయ్య పాల్గొని ప్రభుత్వ పథకాలు, ప్రధానమంత్రి ఆలోచనా విధానం గురించి వివరించారు. భారత దేశం వేగవంతంగా అభివృద్ది చెందేందుకు తోడ్పడాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా వారిని కోరారు.

Click it and Unblock the Notifications