మార్కెట్లోకి మారుతి కొత్త ఆల్టో కె10(పిక్చర్స్)
హైదరాబాద్: రాబోయే రెండుమూడేళ్లల్లో ఉత్పాదక అభివృద్ధి, ఆర్‌అండ్‌డి, మార్కెటింగ్, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక విభాగాల్లో 4,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తెలిపింది. మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో నూతన వెర్షన్ ఆల్టో కె10 కారును విడుదల చేశారు. ఆల్టో కె10 వేరియెంట్ల ఎక్స్‌షోరూమ్ ధర 3,18,376 రూపాయల నుంచి 3,95,408 రూపాయల మధ్య నిర్ణయించారు. ఎజిఎస్ వెర్షన్ ధర 3,93,882 రూపాయలుగా నిర్ణయించారు.
ఈ సందర్భంగా సంస్థ ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సివి రామన్ మాట్లాడుతూ..సంస్థ భవిష్యత్ కార్యకలాపాలను వివరించారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను కొత్త ఆల్టో కె10 అందుకుందన్నారు. రానున్న కాలంలో ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ (ఎజిఎస్) వేరియెంట్ల ఉత్పత్తిని పెంచాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం నెలకు నాలుగు వేల కార్లను ఎజిఎస్ టెక్నాలజీతో ఉత్పత్తి చేస్తున్నామని, కస్టమర్ల డిమాం డు ఆధారంగా వీటి ఉత్పత్తిని క్రమంగా పెంచుతూ పోతామని అన్నారు.
నిరంతరం తీవ్ర రద్దీతో ఉండే భారతీయ రోడ్లపై తరచు గేర్లు మార్చుతూ ప్రయాణం చేయడం డ్రైవర్లపై ఒత్తిడిని పెంచుతోందని, అందువల్ల ఎజిఎస్ వేరియెంట్లకు డిమాండు పెరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం కె10, సెలేరియోల్లో మాత్రమే ఎజిఎస్ వేరియెంట్లున్నాయి. రానున్న కాలంలో అన్ని మోడళ్లలోనూ కూడా ఎజిఎస్ వేరియెంట్లు తయారుచేయనున్నట్టు రామన్ తెలిపారు. ప్రధానంగా ఎజిఎస్ టెక్నాలజీకి అవసరం అయిన పరికరాలను మాగ్నెటీ మరెలీ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు.

ఆల్టో కె10
రాబోయే రెండుమూడేళ్లల్లో ఉత్పాదక అభివృద్ధి, ఆర్‌అండ్‌డి, మార్కెటింగ్, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక విభాగాల్లో 4,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తెలిపింది.

ఆల్టో కె10
మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో నూతన వెర్షన్ ఆల్టో కె10 కారును విడుదల చేశారు.

ఆల్టో కె10
ఆల్టో కె10 వేరియెంట్ల ఎక్స్‌షోరూమ్ ధర 3,18,376 రూపాయల నుంచి 3,95,408 రూపాయల మధ్య నిర్ణయించారు. ఎజిఎస్ వెర్షన్ ధర 3,93,882 రూపాయలుగా నిర్ణయించారు.

ఆల్టో కె10
ఈ సందర్భంగా సంస్థ ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సివి రామన్ మాట్లాడుతూ..సంస్థ భవిష్యత్ కార్యకలాపాలను వివరించారు.

ఆల్టో కె10
భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను కొత్త ఆల్టో కె10 అందుకుందన్నారు. రానున్న కాలంలో ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ (ఎజిఎస్) వేరియెంట్ల ఉత్పత్తిని పెంచాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
మనేసార్‌లో మాగ్నెటీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న కొత్త ప్లాంట్ నిర్మాణం పూర్తి కాగానే ఆ పరికరాలు ఇక్కడే తయారవుతాయని చెప్పారు. దీంతో ఎజిఎస్ వేరియెంట్ల కోసం వేచి ఉండే కాలపరిమితి తగ్గుతుందని ఆయన చెప్పారు. ఎంట్రీ లెవెల్ వేరియెంట్లలో కూడా కస్టమర్ ప్రాధాన్యత ఆధారంగా ఎజిఎస్‌తో పాటు ఎయిర్ బ్యాగులు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.
మారుతి స్విఫ్ట్ విదేశాల్లో క్రాష్ టెస్ట్‌లో విఫలం కావడం గురించిన ప్రశ్నకు స్పందిస్తూ.. మన దేశంలో కూడా కార్ల భద్రతకు సంబంధించి స్పష్టమైన ప్రమాణాలున్నాయని, తమ ఉత్పత్తులన్నీ ఆ ప్రమాణాలకు దీటుగానే ఉన్నాయని రామన్ వివరించారు. అయితే గ్లోబల్ ఎన్‌కాప్ తీసుకున్నవి మరింత అత్యాధునికమైన యూరోపియన్ ప్రమాణాలు కావడం వల్ల వాటికి భారత్‌లో తాము ఉత్పత్తి చేసిన వాహనాలు నిలవలేదని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రమాణాల్లో మార్పులు చేసినా ఆ ప్రమాణాలకు ధీటుగా ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేయడంలో మారుతి ముందుంటుందన్నారు.


Click it and Unblock the Notifications