హైదరాబాద్: నగరానికి నలుదిశలా ఐటీ కారిడార్లను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. అందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నదని తెలిపారు. కేవలం గచ్చిబౌలి ప్రాంతంలోనే కాక. ఆదిభట్ల, ఉప్పల్, మేడ్చల్, శామీర్‌పేట వైపు కూడా ఐటీ కారిడార్లు అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు. అందుకు తగిన అవకాశాలున్నాయని చెప్పారు.
సోమవారం శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరిగిన సాఫ్ట్‌వేర్ ఎగుమతుల సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఇందుకోసం బ్రహ్మాండమైన ఐటీ పాలసీని తీసుకువచ్చేందుకు ఐటీ కంపెనీల ప్రతినిధుల నుంచి ఇన్‌పుట్స్ తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రపంచంలోనే హైదరాబాద్‌లో అన్ని రకాల వసతులు ఉండి, తక్కువ జీవన వ్యయంతో నివసించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా దేశంలోనే ఉత్తమ మౌలిక వసతులున్నాయని తెలిపారు. అందువల్లే మనకు బెస్ట్ ఇన్‌ఫ్రా అవార్డు కూడా వచ్చిందని ఆయన చెప్పారు. కాగా, నానక్‌రాంగూడ, ఖానామెట్, గోపన్‌పల్లి ప్రాంతంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో ప్రధానమైన 11 రహదారులను అభివృద్ధి చేయాలని కంపెనీల ప్రతినిధులు కోరారని చెప్పారు.
‘ఐటీ కారిడార్లలో నీటి సరఫరా విషయాన్ని అడిగారు. ఈ మేరకు అన్ని చర్యలూ తీసుకుంటాం. డిసెంబర్ నాటికి కృష్ణా మూడో దశ ద్వారా నీటి సరఫరా కొంతమేర మెరుగుపడినా.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిస్థాయిలో ఐటీ కంపెనీలు ఎన్ని నీళ్లు అడిగితే అన్ని ఇచ్చేందుకు వ్యవస్థను సిద్ధం చేస్తున్నాం' అని కెటిఆర్ తెలిపారు.
హైదరాబాద్‌కు అనేక కొత్త కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
ఆదిభట్లలోని టీసీఎస్ కంపెనీ 28వేల మంది ఉద్యోగులతో కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇందులో ఎనిమిది వేల మంది మహిళా ఉద్యోగులు ఉన్నందున ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్ కావాలన్నారని చెప్పారు. ‘ఇప్పటికే పోలీస్‌స్టేషన్ ప్రారంభంకాగా.. వాళ్లకు ప్రత్యేకంగా రెండు వాహనాలు కావాలంటే వాటిని కూడా అందించాం. కాంటింజెంట్ కంపెనీ కూడా రూ.500 కోట్లతో 7-8వేల మంది ఉద్యోగాలు కల్పిస్తూ విస్తరణ పనులు చేపట్టింది' అని కెటిఆర్ చెప్పారు.

కెటిఆర్
హైదరాబాద్ నగరానికి నలుదిశలా ఐటీ కారిడార్లను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. అందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నదని తెలిపారు.

కెటిఆర్
కేవలం గచ్చిబౌలి ప్రాంతంలోనే కాక. ఆదిభట్ల, ఉప్పల్, మేడ్చల్, శామీర్‌పేట వైపు కూడా ఐటీ కారిడార్లు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు. అందుకు తగిన అవకాశాలున్నాయని చెప్పారు.

కెటిఆర్
సోమవారం శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరిగిన సాఫ్ట్‌వేర్ ఎగుమతుల సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.

కెటిఆర్
ఐటీ రంగంలో హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఇందుకోసం బ్రహ్మాండమైన ఐటీ పాలసీని తీసుకువచ్చేందుకు ఐటీ కంపెనీల ప్రతినిధుల నుంచి ఇన్‌పుట్స్ తీసుకుంటున్నట్లు చెప్పారు.

కెటిఆర్
ప్రపంచంలోనే హైదరాబాద్‌లో అన్ని రకాల వసతులు ఉండి, తక్కువ జీవన వ్యయంతో నివసించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా దేశంలోనే ఉత్తమ మౌలిక వసతులున్నాయని తెలిపారు. అందువల్లే మనకు బెస్ట్ ఇన్‌ఫ్రా అవార్డు కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
ఐటీఐఆర్‌కు సంబంధించి నవంబర్ 11న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఔటర్ రింగు రోడ్డులో ఒక ముక్క పనులు పూర్తి కావాల్సి ఉందని, దానికి అధికారులు టెండర్లు కూడా పిలిచారని తెలిపారు. అదే విధంగా ఔటర్‌ను అనుసంధానించే 16 రేడియల్ రోడ్లను హెచ్‌ఎండీఏ నుంచి ఆర్అండ్ బికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుందని వివరించారు.
సాఫ్ట్‌వేర్ రంగంలో జాతీయ సరాసరి కంటే ఎప్పుడూ హైదరాబాద్ సరాసరి ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల సంఘం అధ్యక్షుడు రమేశ్ అన్నారు. మంత్రి వెంట టీఎస్‌ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి హరిప్రీత్‌సింగ్, జలమండలి ఎండీ జగదీశ్వర్, ఐటీ (కమ్యూనికేషన్స్) డైరెక్టర్ ఏఎస్ రమేష్, జలమండలి డైరెక్టర్ రామేశ్వర్‌రావు పాల్గొన్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications