న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద టెలికం ఆపరేటర్ ఎయిర్ టెల్ డిసెంబర్ నెల నుంచి ఎంపిక చేసిన ప్లాన్స్‌లలో పోస్ట్ పెయిడ్ రెంటల్స్ 12 శాతం పెంచింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌లో డిసెంబర్ మూడో తేదీ నుంచి కొత్త రెంటల్స్ అమలులోకి వస్తాయని ప్రకటించింది.
దీని ప్రకారం నెలకు 199 రూపాయల ప్లాన్‌లో నెలవారీ రెంటల్ 224 రూపాయలవుతుంది. ఈ మేరకు ఎయిర్‌టెల్ తమ కస్టమర్లందరికీ సందేశాలు పంపింది. ఈ విషయంలో ఎయిర్‌టెల్‌ను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కస్టమర్లున్నారు. ఎయిర్ టెల్ సెప్టెంబర్ త్రైమాసికానికి ప్రకటించిన ఫలితాల్లో నికరలాభం రూ. 1,383 కోట్లు. మొబైల్ డేటా ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కువ మొత్తంలో వృద్ది చెందిందని పేర్కొన్నారు.
మూడు నెలల కాల పరిమితిలో ఎయిర్‌టెల్ రేట్లు పెంచడం ఇది రెండో సారి. సెప్టెంబర్‌లో కంపెనీ మొబైల్ ఇంటర్నెట్ రేట్లను 33 శాతం మేరకు పెంచింది. ప్రీ పెయిడ్ వినియోగదారులకు ప్రయోజనాలను తగ్గించింది.
2జీ కుంభకోణంలో సుప్రీం కోర్టు కొన్ని స్పెక్ర్టమ్ లైసెన్సులను రద్దు చేయడంతో గత రెండు సంవత్సరాల్లో టెలికం సర్వీసులను అందిస్తున్న ప్రొవైడర్లు ఎక్కువ మొత్తంలో ప్రజల వద్ద నుండి డబ్బును లాగుతున్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications