'నోకియా' పేరు మారింది 'మైక్రోసాఫ్ట్ లుమియా'
న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్లే అయింది. భారత్‌లో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ మొబైల్ కంపెనీ 'నోకియా' బ్రాండ్ పేరు మారింది. నోకియా స్ధానంలో 'మైక్రోసాప్ట్ లుమియా' పేరును అధికారికంగా మార్చినట్లు మైక్రోసాఫ్ట్ సంస్ధ తెలిపింది.
ఈ మేరకు నోకియా ఫ్రాన్స్ ఫేస్ బుక్ పేజ్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా పేజీలలో మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. "ఇతర దేశాలు కూడా మార్చిన బ్రాండ్ పేరును ఉపయోగించేలా త్వరలో చర్యలు తీసుకుంటాం" అని తెలిపింది.
తొలిసారిగా ఫ్రాన్స్ నుంచే మైక్రోసాప్ట్ లుమియా పేరు వాడుకలోకి రానుంది. అటు స్మార్ట్ ఫోన్లలో కూడా నోకియా పేరును మైక్రోసాఫ్ట్ తీసివేయనుంది. నెట్‌వర్క్స్, మ్యాపింగ్ సర్వీసెస్, టెక్నాలజీ డెవలప్ మెంట్, లైసెన్స్ విషయాలపై దృష్టి పెట్టనుంది.

ఫిన్‌ల్యాండ్ దేశపు నోకియా కంపెనీ మొబైల్ తయారీ యూనిట్‌ను 7.2 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. ఈ విక్రయంతో నోకియాలో పనిచేస్తున్న 16వేల మంది ఉద్యోగులు కూడా మైక్రోసాప్ట్ పరిధిలోనికి వచ్చారు. ప్రస్తుతం నోకియా వినియోగించే అన్ని వ్యవస్థల లైసెన్సుల కోసం కూడా మైక్రోసాప్ట్ పదికోట్ల డాలర్లను వెచ్చించింది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్, శ్యాసంగ్ సత్తా చాటుతూ నోకియా మార్కెట్ వాటాకు గండి కొట్టాయి. 2007లో యాపిల్ కంప్యూటర్స్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడంతో నోకియా ఫోన్లను కొనేవారి సంఖ్య మరింతగా తగ్గారు. ఇక
మధ్యతరహా సెల్‌ఫోన్లు కొనే వారి దృష్టి శ్యాసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్ల మీదకు మళ్లింది. దీంతో నోకియా కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి చివరకు మూసివేయాల్సిన పరిస్ధితికి వచ్చింది.


Click it and Unblock the Notifications