
ఐతే కంపెనీల చట్ట 1956లోని 391, 394 సెక్షన్ల కింద అనుమతులు లభించాల్సి ఉందని సీఎమ్‌సీ బాంబే స్టాక్ ఎక్సేంజికి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. విలీన అనంతరం రూ. 10 విలువ గల ప్రతీ 100 సీఎమ్‌సీ షేర్లకు రూ. 1 విలువ గల 79 టీసీఎస్ షేర్లను సీఎమ్‌సీ వాటాదార్లు పొందుతారు.
సెప్టెంబర్ 30, 2014తో ముగిసిన త్రైమాసికంలో సీఎమ్‌సీ రూ. 616.96 కోట్ల ఆదాయంపై రూ. 76 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఆదాయం, లాభాలు వరుసగా 10 శాతం, 13 శాతం మేర వృద్ది చెందాయి.
1975లో స్దాపించిన సీఎమ్‌సీని ప్రభుత్వం నుంచి 1990ల్లో టీసీఎస్ కొనుగోలు చేసింది. ఇక జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ అంచనాలకు దిగువగా ఫలితాలను ప్రకటించింది.
సెప్టెంబర్‌తో ముగిసిన త్తైమాసికంలో టీసీఎస్ నికర లాభం 13.2 శాతం పెరిగి రూ. 5,244 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో రూ. 4653.9 కోట్లుగా ఆదాయం ఉంది.
ఇది ఇలా ఉంటే టీసీఎస్‌లో లక్ష మందికి పైగా మహిళా ఉద్యోగుల మైలురాయిని అధిగమించింది. దీంతో సెప్టెంబర్ త్రైమాసికం చివరకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.13 లక్షలకు చేరింది.


Click it and Unblock the Notifications