న్యూఢిల్లీ: ఐరోపాకు చెందిన విమాన తయారీ సంస్ద ఎయిర్ బస్ నుంచి అత్యాధునిక ఏ320 నియో విమానాలు 250 కొనుగోలు చేయాలని ఇండిగో నిర్ణయించింది. ఈ ఒప్పందం విలువ 2550 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో రూ.1.55 లక్షల కోట్లు.
యారిస్‌లో ఉన్న ఎయిర్‌బస్ ప్రధాన కార్యాలయంలో ఇండిగో సహ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్లు రాకేశ్ గంగ్ వాల్, ఇండిగో మాతృసంస్ద ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పటి వరకు ఎయిర్‌బస్‌కు వచ్చిన ఆర్డర్లలో ఇదే అతి పెద్దది. ఈ ఒప్పందం విలువ ఇరు కంపెనీలు వెల్లడించకపోయినప్పటికీ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉన్న ఏ-320 ధర ఆధారంగా అగ్రిమెంట్ 2550 కోట్ల డాలర్ల స్థాయిలో ఉంటుందని ప్రాథమిక అంచనా.

ఈ విమానాలు సరఫగా 2018 నుంచి ప్రారంభం అవుతుంది. కొత్త మార్గాలలో నడిపేందుకు, సగటున 6ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన విమానాల స్దానంలో కొత్తవి ప్రవేశపట్టేందుకు వీటిని ఇండిగో వినియోగించనుంది.
భారత్‌లో ఎక్కవకాలం వ్యాపారం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ భారీ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్యా ఘోష్ తెలిపారు. సింగపూర్ తర్వాత ఇండియా నుంచి అధిక స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయని ఎయిర్‌బస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ రావు ఈ సందర్భంగా చెప్పారు.
2005లో 100ఏ 320 విమానాలు, 2011లో 180 ఏ 320 నియో విమానాలకు ఇండిగో ఆర్డరు ఇచ్చింది. వీటి విలువ 11 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 67,100 కోట్లు). ప్రస్తుతం ఇండిగో సంస్ద వద్ద 180 సీట్ల ఏ320 విమానాలు 83 ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications