చెన్నై: నోకియా కార్పొరేషన్ తన చెన్నై ఫ్యాక్టరీని మూసివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని నోకియా ఇండియా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. చెన్నై ఫ్యాక్టరీని నవంబర్ 1 నుంచి మూసివేయనున్నట్టు మంగళవారం నోకియా ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో 900 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో అధిక శాతం మంది మహిళలు. ఈ ఫ్యాక్టరీని మూసివేస్తూ నోకియా తీసుకున్న నిర్ణయం నిబంధనలకు విరుద్ధమని, ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా కల్పించాల్సిందిగా నోకియా ఇండియా ఉద్యోగ సంఘాల ప్రెసిడెంట్, సిట్టింగ్ ఎంఎల్‌ఎ ఎ సౌందర రాజన్ కోరారు.

ఈ వారంలో ఉద్యోగులతో సమావేశమై తదుపరి చర్యల గురించి చర్చిస్తామన్నారు. సిబ్బందికి న్యాయం జరిగే విధంగా చట్టపరమైన మార్గాలను ఎంచుకుంటామని ఆయన తెలిపారు. కార్మిక శాఖను కలిసి, తమ సమస్యను విన్నవిస్తామని వెల్లడించారు.
నోకియా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ 720 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన నేపథ్యంలో... నోకియా తన 6,600 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. దీన్ని వినియోగించుకుని 5,700 మంది సంస్థ నుంచి తప్పుకున్నారు. మిగతా వారు మాత్రం కంపెనీలోనే కొనసాగారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications