న్యూఢిల్లీ: కంప్యూటర్, ప్రింటింగ్ పరికరాల తయారీలో ప్రముఖ సంస్దగా ఎదిగిన టెక్నాలజీ దిగ్గజం హ్యూలెట్ ప్యాకార్డ్ (హెచ్‌పీ) రెండు సంస్దలుగా విడిపోనుంది. పర్సనల్ కంప్యూటర్స్, ప్రింటింగ్ బిజినెస్‌లతో కూడిన యూనిట్ ఒక సంస్దగానూ, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సాప్ట్‌వేర్ సర్వీసుల బిజినెస్‌లు మరో కంపెనీగా ఏర్పాటు కానున్నాయి.
ఫార్చూన్ 50లో భాగంకానున్న ఈ రెండు సంస్దలూ విడిగా లిస్టింట్ కానున్నాయి. పర్సనల్ కంప్యూటర్స్, ప్రింటింగ్ బిజినెస్‌లతో కూడిన యూనిట్‌కు ప్రస్తుత హెచ్‌పీ (లోగో)తో కొనసాగనుంది. ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సాప్ట్‌వేర్ సర్వీసుల బిజినెస్ యూనిట్‌ను హ్యూలెట్ ప్యాకార్డ్ ఎంటర్ ప్రైజ్ పేరుతో నిర్వహించనుంది. ఈ వివరాలను కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొనుంది.

2015 చివరికల్లా పూర్తి కానున్న ఈ విభజనలో భాగంగా వాటాదారులకు రెండు కంపెనీల షేర్లను కేటాయించనున్నారు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల్లో మరింత వృద్ధి సాధించే దిశగా రెండుగా విడిపోనున్న హెచ్‌పీ, తన ఉద్యోగుల్లో 5 వేల మందికి ఉద్వాసన పలికేందుకు సన్నాహాలు చేస్తోంది.
సాధారణంగా కార్పోరేట్ సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరించే దిశలో రెండుగా విడిపోయే సందర్భాల్లో ఉద్యోగాల సంఖ్య పెరుగుతుండటంతో పాటు, ఉద్యోగాలపై కోత పడుతున్న విషయం తెలిసిందే. సంస్థ పునర్వవస్థీకరణలో భాగంగానే ఉద్యోగాలపై కోత విధించక తప్పడం లేదని సంస్థ చెబుతోంది.
హెచ్‌పీ సంస్ద రెండుగా చీలిపోవడంతో సంస్థలోని ఉద్యోగుల్లో ఎవరిపై వేటు పడుతుందోనన్న ఆందోళన మొదలైంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications