హైదరాబాద్: కొత్త ప్రభుత్వం హైదరాబాదులో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో పలు అంతర్జాతీయ కంపెనీలు ఆకర్షణీయమైన ప్రాజెక్టులతో ముందుకు వస్తున్నాయి. ప్రపంచంలోనే ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీ అయిన టిష్‌మ్యాన్ స్పియర్ గతంలో ప్రకటించిన తెల్లాపూర్ టెక్నోసిటీ ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది.
మంగళవారం నాడు సచివాలయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో చర్చలు జరిపిన టిష్‌మ్యాన్ స్పియర్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ యం స్పైస్ తెల్లాపూర్ టెక్నోసిటీని పునరుద్ధరిస్తున్నట్లు ఐటీ మంత్రి కేటీఆర్‌తో తెలిపారు.

కంపెనీ ప్రతినిధులతో కలిసి తాము చేపట్టబోయే ప్రాజెక్టు వివరాలను మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీ పాల్గొన్నారు.

వంద ఎకరాల్లో టిష్‌మ్యాన్ స్పియర్ కంపెనీ చేపట్టబోతున్న తెల్లాపూర్ టెక్నోసిటీ ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కంపెనీ ప్రతినిధులకి హామీ ఇచ్చారు. దీని పైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నాక పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications