For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోర్బ్స్ జాబితా: 21వ సారీ టాప్‌లోనే బిల్ గేట్స్

|

న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 21వ సారి కూడా ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితాలో తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్ 400 సంపన్నుల జాబితాలో బిల్ గేట్స్ వరుసగా 21వ సారి కూడా మొదటి స్థానంలో నిలిచారు. నిరుడు నుంచి ఆయన సంపద 9 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. ఇదే విధంగా తమ సంపదను పెంచుకున్న ధనికులు తమ స్థానాలను పదిలపర్చుకున్నారు.

బిల్ గేట్స్ ఆస్తి 81 బిలియన్ డాలర్లు. 67 బిలియన్ డాలర్ల సంపదతో బెర్క్‌షైర్ హాత్వే వ్యవస్థాపకుడు, మేనేజ్‌మెంట్ గురు వారెన్ బఫెట్ రెండో స్థానంలో ఉన్నారు. 50 బిలియన్ డాలర్ల సంపదతో ఒరాకిల్ సిఈఓ లారీ ఎల్లిసన్ మూడో స్థానం నిలిచారు. ఫేస్‌బుక్ సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫోర్బ్స్ 400 జాబితాలో 11 స్థానంలో ఉన్నారు.

Forbes rich list topped by Bill Gates again at $81B

కోచ్ ఇండిస్ట్రీస్ అధిపతులైన చార్లెస్, డేవిడ్ కోచ్ సోదరులు 42 బిలియన్ డాలర్ల సంపదతో నాల్గవ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో 27మంది సంపన్నులు కొత్తగా చేరారు. వారిలో వాట్సప్ సహయజమాని జాన్ కౌమ్ 62వ స్థానంలో ఉన్నారు. వాట్సప్‌ను కొనుగోలు చేయనున్నట్లు గత ఫిబ్రవరిలోనే ఫేస్‌బుక్ ప్రకటించిన విషయం తెలిసిందే.

వీరందరి సంపద 13శాతం పెరగడంతో 2.29 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు గురైనప్పటికీ వ్యాపారవేత్తల సంపద మరింత పెరగడం గమనార్హం.

English summary

ఫోర్బ్స్ జాబితా: 21వ సారీ టాప్‌లోనే బిల్ గేట్స్ | Forbes rich list topped by Bill Gates again at $81B

Microsoft founder Bill Gates is once again the richest man in America, worth nearly $81 billion according to financial magazine Forbes.
Story first published: Wednesday, October 1, 2014, 17:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X