హైదరాబాద్: కొత్త పరిశ్రమలకు అనుమతులు జారీ చేయడంలో అవినీతి రహిత పద్దతి (జీరో కర ప్షన్)ని ప్రవేశ పెడుతున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రకటించారు. దాంతో పాటు అధికారుల అనవసర ప్రమేయాన్ని తగ్గించేందుకు వీలైన విధానాన్ని అమలుపరుస్తామని చెప్పారు. సింగిల్ విండో పద్దతిలో పరిశ్రమలకు అనుమతులను జారీ చేసే విధానంపై ముఖ్యమంత్రి సోమవారం పారిశ్రమికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.
ఈ సమావేశంలో భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), తెలంగాణ పారిశ్రామిక సంఘం, ఫ్యాప్సీ ప్రతినిధులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రభుత్వ సలహదారుడు పాపారావు, జెన్‌కో సిఎండి ప్రభాకర్, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి పాల్గొన్నారు.
రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం కొత్త పాలసీని అమలు పరచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. సింగిల్ విండో పద్దతిలో అనుమతులను జారీ చేయాలని నిర్ణయించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతులను జారీ చేసే విధంగా కొత్త విధానాన్ని ప్రవేళపెట్టనున్నారు. అందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే సోమవారం పరిశ్రమల సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

సూచలు చేయవచ్చు..
తాము రూపొందిస్తున్న కొత్త పారిశ్రామిక విధానంలో ఇంకేమైన మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటే అందుకు సంబంధించిన సూచనలను చేయవచ్చని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

తిరగాల్సిన అవసరం లేదు...
అధికారుల చుట్టూ పారిశ్రామిక వేత్తలు పదే పదే తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త పద్దతిని ప్రవేశపెడుతున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.

త్వరలోనే ప్రకటన
ఈ విధానానికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ పారిశ్రామిక ప్రతినిధులకు స్పష్టం చేశారు.

విధానానికి కితాబు
ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రతిపాదిత పారిశ్రామిక విధానం రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని వారన్నారు. అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులను తాము సూచిస్తామని వారు తెలిపారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications