సింగపూర్: భారత అత్యంత సంపన్నుల జాబితా నుంచి యుబి గ్రూప్ ఛైర్మన్, కింగ్ ఫిషర్ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా పేరు గల్లంతయ్యింది. తాజాగా ప్రకటించిన 100 మందితో కూడిన భారతదేశ సంపన్న వ్యక్తుల ఫోర్బ్స్ జాబితాలో విజయ్ మాల్యాకు చోటుదక్కలేదు.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో మాల్యా ఉద్దేశ పూర్వక ఎగవేతదారుడి (డిఫాల్టర్)గా ఇప్పటికే ఓ బ్యాంకు ప్రకటించిన విషయం తెలిసిందే.

2013లో విడుదలైన ఫోర్బ్స్ జాబితాలో విజయ్ మాల్యా 800 మిలియన్ కోట్ల సంపదతో 84వ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా, మాల్యాతోపాటు మరో 11మంది కూడా ఈ జాబితాలో చోటు సంపాదించలేకపోయారు. విలాస పురుషుడైన మాల్యా పేరును ఓ బ్యాంకు డిఫాల్టర్‌గా ప్రకటించినందుకే సంపన్న జాబితా నుంచి తప్పించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.
విజయ్ మాల్యా మొత్తం 17 బ్యాంకులకు రూ. 7,600 కోట్ల వరకు బాకీ ఉన్నారు. ఇప్పటికే రూ. 2000 కోట్ల విలువైన షేర్లను స్వాధీనం చేసుకోగా, మరికొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. భూషణ్ స్టీల్ అధినేత బ్రిజ్ భూషణ్ సింఘాల్ కుమారుడు ఓ కుంభకోణంలో అరెస్ట్ కావడంతో ఆయనను కూడా జాబితా నుంచి తప్పించామని ఫోర్బ్స్ పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications