హైదరాబాద్: ఆసియా - ఫసిఫిక్ ప్రాంతంలో అత్యంత శక్తి వంతమైన మహిళల జాబితాను 'ఫార్చ్యూన్' మ్యాగజైన్ విడుదల చేసింది. ఈ జాబితాలో తొలి 25 మందిలో 8మంది భారతీయులకు చోటు లభించింది. ఇందులో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ భారతీయుల లిస్టులో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాదికి 25 మంది వివరాలతో కూడిన ఆసియా-పసిఫిక్ లిస్ట్‌లో మాత్రం ఆమెకు రెండో స్థానం దక్కింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య నాలుగో స్థానంలో నిలిచారు.
ఆస్టేలియాకు చెందిన వెస్ట్ ప్యాక్ బ్యాంక్ చీఫ్ గేయిల్ కెల్లీ మొదటి స్దానం సాధించారు. ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)కు చెందిన నిషి వాసుదేవ ఐదవ స్దానంలో ఉన్నారు. వీరిద్దరూ తొలిసారి ఈ జాబితాలో స్దానం సంపాదించారు.

యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ 10వ స్థానంలో ఉన్నారు. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షాకు 19, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్‌ఎస్‌ఈ) సీఈవో చిత్ర రామకృష్ణకు 22, హెచ్‌ఎస్‌బీసీ ఇండియా హెడ్ నైనా లాల్ కిద్వాయ్‌కి 23, టాఫే చైర్మన్ అండ్ సీఈవో మల్లికా శ్రీనివాసన్‌కు 25వ స్థానం దక్కింది.
భారతీయ జాబితాలో కొచ్చర్ తర్వాత స్థానం భట్టాచార్యకు దక్కింది. గతవారం విడుదలైన ప్రపంచవ్యాప్త జాబితాలో భారత్‌కు చెందిన మహిళ, పెప్సికో సీఈవో ఇంద్రానూయి మూడో స్థానంలో నిలిచారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications