హైదరాబాద్: తాను టెక్నాలజీని అమితంగా ఇష్టపడుతానని, మొబైల్ యాప్స్‌కు తాను అతి పెద్ద అభిమానిని అని తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ అన్నారు. ఈ యాప్స్ మన జీవితాన్ని మిరంత వినోదాత్మకంగా, సౌకర్యంగా మారుస్తాయని ఆయన అన్నారు.
గురువారం హైదరాబాదులోని సోమాజిగుడాలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడారు. ఈ టీవిసిలో వినియోగించిన వస్తువులను ఎంత సులభంగా ఓఎల్ఎక్స్ మొబైల్ యాప్ ద్వారా విక్రయించవచ్చునో చూపుతారని ఆయన అన్నారు.
సులభంగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మూడు సులభమైన దశల్లో మీ యాప్‌ను పోస్టు చేయడమేనని ఆయన అన్నారు. సులభంగా మీరు అప్‌గ్రేడ్ కావాలనుకుంటే పాత వస్తువులను తరుచుగా అమ్ముతుండడం మంచిదని ఆయన అన్నారు.

అమ్ముతానని సరదాగా...
ఈ టీవిసి షూటింగ్ సమయంలో సరదాగా అమ్ముతానని పోస్ట్ చేశాను గానీ ఎవరూ కొనడానికి ముందుకు రాలేదని అల్లు అర్జన్ చెప్పారు. త్వరలోనే తన వద్ద ఉన్న నికాన్ కెమెరాను అమ్ముతానని చెప్పారు.

స్వయంగా రూపొందించా...
టెక్నాలజీని తాను అమితంగా ప్రేమిస్తానని, తన పేరిట ఉన్న ఓ యాప్‌ను స్వయంగా రూపొందించానని అల్లు అర్జున్ చెప్పారు.
రేసు గుర్రం సమయంలో..
తాను రూపొందించిన యాప్‌లో తన గురించిన విశేషాలను తెలుసుకోవచ్చునని, రేసు గుర్రం సినిమా సమయంలో ఆ యాప్‌ను విడుదల చేశానని, 35 వేల మంది దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారని అల్లు అర్జున్ చెప్పారు.

ఇదే మొదటిసారేమో..
తనకు తెలిసి ఓ స్టార్ తన పేరిట ఓ యాప్ విడుదల చేయడం ఇదే మొదలేమోనని అల్లు అర్జున్ అన్నారు. ప్రతి రోజూ తాను చేసే పనిని తాను ఎంతగానో ప్రేమిస్తానని ఆయన అన్నారు.

త్రివిక్రమ్ సినిమాలో...
తాను త్వరలోనే త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు అల్లు అర్జున్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓఎల్ఎక్స్ డాట్ ఇన్ సిఈవో అమర్జిత్ బాత్రా కూడా పాల్గొన్నారు.

బ్రాండ్ అంబాసిడర్‌గా..
ఓఎల్ఎక్స్ డాట్ ఇన్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఆ సంస్థ రూపొందించిన టీవీ కమర్షియల్ విడుదల కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చేశారు.

పాతవస్తువులు అమ్మడమే..
సులభంగా మీరు అప్‌గ్రేడ్ కావాలనుకుంటే పాత వస్తువులను తరుచుగా అమ్ముతుండడం మంచిదని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications