హైదరాబాద్: దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు శాతం వాటా సాధించడమే లక్ష్యమని ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎంఐపిఎల్) ప్రకటించింది. ప్రస్తుతం అమ్మకాల్లో సుజుకీ మార్కెట్ వాటా మూడు శాతం ఉందని, దానిని ఐదు శాతానికి పెంచుతామని వెల్లడించింది.
సుజుకి ‘జిక్సర్-ఆర్ 100' బైకును బుధవారం హైదరాబాద్‌లో ఎస్‌ఎంఐపిఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా ఆవిష్కరించారు. 155 సిసి సామర్థ్యం కలిగిన దీని ధర రూ. 74,552. ఈ సందర్భంగా అతుల్ గుప్తా మాట్లాడుతూ.. లీటర్ పెట్రోల్‌కు 63.5 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4 లక్షల బైకులు విక్రయించినట్టు చెప్పారు.
ఈ ఏడాది అమ్మకాలను ఐదు లక్షలకు పెంచాలనే ధృడ లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. అలాగే గత 6 నెలల నుంచి బైకుల ఎగుమతులు కూడా ప్రారంభించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,500 నుంచి 2,000 వరకు బైకులను ఎగుమతి చేశామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా తయారైన బైకుల్లో 10 శాతం ఎగుమతులు చేయనున్నట్టు అతుల్ తెలిపారు.

సుజుకి ‘జిక్సర్-ఆర్ 100'
దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు శాతం వాటా సాధించడమే లక్ష్యమని ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎంఐపిఎల్) ప్రకటించింది.

సుజుకి ‘జిక్సర్-ఆర్ 100'
ప్రస్తుతం అమ్మకాల్లో సుజుకీ మార్కెట్ వాటా మూడు శాతం ఉందని, దానిని ఐదు శాతానికి పెంచుతామని వెల్లడించింది.

సుజుకి ‘జిక్సర్-ఆర్ 100'
సుజుకి ‘జిక్సర్-ఆర్ 100' బైకును బుధవారం హైదరాబాద్‌లో ఎస్‌ఎంఐపిఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా ఆవిష్కరించారు. 155 సిసి సామర్థ్యం కలిగిన దీని ధర రూ. 74,552.

సుజుకి ‘జిక్సర్-ఆర్ 100'
ఈ సందర్భంగా అతుల్ గుప్తా మాట్లాడుతూ.. లీటర్ పెట్రోల్‌కు 63.5 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications