సత్యం కుంభకోణం: అందరూ హజరు కావాలి

సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సత్యం కంప్యూటర్స్ సిఎఫ్‌ఓ వడ్లమాని శ్రీనివాస్, ఆడిటింగ్ నిర్వహించిన పీడబ్లుయసీ ఆడిటింగ్ సంస్థతోపాటు ఆడిటర్లు తళ్లూరి శ్రీనివాస్, గోపాలకృష్ణన్‌తోపాటు దాదాపు 15 మందిని నిందితులుగా పేర్కొంది.
నేర విచారణ చట్టంలోని సెక్షన్ 200తోపాటు సెబీ చట్టంలోని సెక్షన్లు 12(ఎ), 24(1), 26, 27ల కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. అంతేగాక, సత్యం కంప్యూటర్స్‌కు ఆడిటింగ్ నిర్వహించిన ఆడిటర్లు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని, తప్పుడు ఆడిటింగ్ నివేదికలు ఇచ్చి లక్షలాది మంది మదుపరులను మోసం చేశారని సెబి ఆరోపించింది.
2009 జనవరి 7న అప్పట్లో సత్యం కంప్యూటర్‌స చైర్మన్‌గా ఉన్న రామలింగరాజు తన తప్పిదాలను అంగీకరిస్తూ సెబికి మెయిల్ పంపించారు. షేర్ల విక్రయం ద్వారా రూ.543.93 కోట్ల మేరకు రాజు సోదరులు అనుచిత లబ్ధి పొందారని, షేర్లను తాకట్టు పెట్టడం ద్వారా రూ.1,258 కోట్లను పొందారని సెబి పేర్కొంది.


Click it and Unblock the Notifications