హైదరాబాద్: ఐటి రంగంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని, పలు బహుళ జాతి కంపెనీలు ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేయడానికి సంప్రదిస్తున్నాయని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. నగరంలో ఐటి రంగాన్ని ప్రోత్సహించేందుకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఐటి రంగం విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ఐఎస్‌బి, నల్సార్, హైదరాబాద్ త్రిబుల్ ఐటిల మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది.
ఈ సమావేశంలో పాల్గొన్న కెటిఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌ను ఐటి రంగంలో దేశంలో మొదటి స్థానంలో నిలపనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో ఐటికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఐటి కంపెనీలు విస్తరణ చేపడుతున్నాయని, అదే సమయంలో కొత్తగా కంపెనీలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. త్వరలోనే హైదరాబాద్‌లో వైఫై వస్తోందని చెప్పారు. ఐఐటి, ఐఎస్‌బి, నల్సార్‌ల సహకారంతో హైదరాబాద్‌లో ఇంక్యుబేటర్ సెంటర్ ప్రారంభమవుతోందని తెలిపారు.
ఇంజనీరింగ్ విద్యార్థి డిగ్రీ పూర్తి చేసుకుని బయటకు రాగానే పరిశ్రమకు అవసరం అయ్యే విధంగా చదువుకునే సమయంలోనే తగిన శిక్షణ అవసరమని కెటిఆర్ అన్నారు. దీని కోసం టాస్క్‌ను ఏర్పాటు చేశామని, విద్యార్థి డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగానే పరిశ్రమకు అవసరం అయిన విధంగా శిక్షణ ఉంటుందని తెలిపారు. విద్యా సంస్థలను, పరిశ్రమలను అనుసంధానం చేస్తూ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దీని కోసం త్రిబుల్ ఐటిలోని భవనాన్ని ఉపయోగించుకున్నా తరువాత ప్రత్యేకంగా మూడు లక్షల చదరవు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన భవనాన్ని నిర్మించి శాశ్వతంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించనున్న నూతన పారిశ్రామిక విధానం గురించి దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోందని, ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ సింగపూర్‌లో పర్యటించినప్పుడు వివిధ దేశాల పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌పై ఆసక్తి చూపించారని కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఐటితో పాటు హార్డ్‌వేర్ రంగంలో సైతం అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చర్ క్లస్టర్ల ఏర్పాటుకు జపాన్‌కు చెందిన కంపెనీ, బ్రిటన్ కంపెనీ సంప్రదింపులు జరుపుతున్నట్టు కెటిఆర్ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, శిక్షణ తదితర కార్యక్రమాల నిర్వహణకు ప్రపంచ బ్యాంకు 450 కోట్ల రూపాయలు అందించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ నిధులను వ్యయం చేసిన తరువాత మరో 450 కోట్ల రూపాయలు విడుదలకు అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎంటర్‌ప్రిన్యూర్లకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని చెప్పారు.

కెటిఆర్
ఐటి రంగంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని, పలు బహుళ జాతి కంపెనీలు ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేయడానికి సంప్రదిస్తున్నాయని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు.

కెటిఆర్
హైదరాబాద్‌లో ఐటికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఐటి కంపెనీలు విస్తరణ చేపడుతున్నాయని, అదే సమయంలో కొత్తగా కంపెనీలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

కెటిఆర్
నగరంలో ఐటి రంగాన్ని ప్రోత్సహించేందుకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఐటి రంగం విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ఐఎస్‌బి, నల్సార్, హైదరాబాద్ త్రిబుల్ ఐటిల మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది.

కెటిఆర్
ఈ సమావేశంలో పాల్గొన్న కెటిఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌ను ఐటి రంగంలో దేశంలో మొదటి స్థానంలో నిలపనున్నట్టు తెలిపారు.

కెటిఆర్
హైదరాబాద్‌లో ఐటికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఐటి కంపెనీలు విస్తరణ చేపడుతున్నాయని, అదే సమయంలో కొత్తగా కంపెనీలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

కెటిఆర్
త్వరలోనే హైదరాబాద్‌లో వైఫై వస్తోందని చెప్పారు. ఐఐటి, ఐఎస్‌బి, నల్సార్‌ల సహకారంతో హైదరాబాద్‌లో ఇంక్యుబేటర్ సెంటర్ ప్రారంభమవుతోందని తెలిపారు.


Click it and Unblock the Notifications