న్యూఢిల్లీ: లండన్‌లలోని తన హోటళ్ల అమ్మేందుకు గాను మరో పది రోజులు గడువు కావాలని సహారా చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీంకోర్టును కోరారు. హోటల్స్ అమ్మేందుకు మరో ముగ్గురు, నలుగురు కొనుగోలుదారులతో మాట్లాడాల్సి ఉందని ఆయన న్యాయస్దానానికి తెలిపారు.
గడువు ఇవ్వకపోతే కొనుగోలు ఒప్పందం రద్దవుతుందని సుబ్రతారాయ్ పేర్కొన్నారు. ఆయన జైలు నుండి హోటళ్ల అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలు నిర్వహించుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనలకు వ్యతిరేకంగా రెండు గ్రూప్ కంపెనీలు మదుపుదారుల నుండి దాదాపు రూ. 24 కోట్ల వసూలు చేసిన కేసులో గడిచిన ఏదు నెలల నుండి సుబ్రతారాయ్ తీహర్ జైలు కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

ఈ కేసులో బెయిల్ పొందాలంటే రూ. 10 వేల కోట్లు చెల్లించాలని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే. రూ. 10,000 కోట్లలో తొలుత కొంత మొత్తం చెల్లించి రెగ్యులర్ బెయిల్‌పై విడుదలై, అటు తర్వాత మిగిలిన మొత్తాలను చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని సుప్రీం కోర్టును సహారా కోరుతోంది. ఐతే ఇందుకు న్యాయమూర్తులు అంగీకారం తెలిపలేదు. ఐతే తాజాగా పెరోల్‌కు సైతం అత్యున్నత న్యాయస్దానం తిరస్కరించింది.
కాగా న్యూయార్క్, లండన్ లలో ఉన్న లగ్జరీ హోటల్స్ సహా దేశంలోని తొమ్మిది ఆస్తులను అమ్మేందుకు మాత్రం సుప్రీం కోర్టు ఓకే అంది. ఐతే జైలు వెలుపల ఎక్కడైనా ఇందుకు సంబంధించి కొనుగోలుదారులతో లావాదేవీలు జరపడానికి వీలుగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ సమయం కేటాయిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications