For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా యాప్ పోటీల్లో హైదరాబాదీ(ఫొటోలు)

|

హైదరాబాద్: త్వరలో నార్వేలో జరిగే యునినార్ డిజిటల్ విన్నర్స్ అంతర్జాతీయ సదస్సుకు ఆసియా ఉత్తమ యాప్ విభాగంలో హైదరాబాద్ వాసి రూపొందించిన ‘లైవ్లీ హుడ్స్ 360' యాప్ భారత్ తరపున పోటీ పడుతోంది. ఆసియా ఉత్తమ యాప్ విజేతకు దాదాపు రూ. 9.79 లక్షల బహుమతి లభించనుంది. యునినార్ ఏపి సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కుమార్ కన్నన్, చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ పూజా థాక్రన్, నాస్కామ్ ఫౌండేషన్ ప్రతినిధి రాజ్యలక్ష్మి గురువారం ఇక్కడ రూపకర్త రఘు కంచుస్తంభంను పరిచయం చేశారు.

అరకు ప్రాంతంలోని 650 గ్రామాల్లో కాఫీ పండించే 12వేల మంది రైతులు ఈ యాప్‌ని వినియోగిస్తున్నారుని యాప్ రూపకర్త, కాన్సెప్ట్ వేవ్స్ కంపెనీ వ్యవస్థాపకుడు రఘు కంచుస్తంభం తెలిపారు.

దిగుబడి అంచనా, నికర దిగుబడి, ఒక్కో రైతు ఎంత పండిస్తాడు, చెల్లింపులు, ధర వంటి సమాచారం యాప్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ‘గతంలో డబ్బులు చెల్లింపునకు నెల రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం ఈ యాప్‌ని ఉపయోగించడం ద్వారా ఒక రోజులోనే డబ్బులు రైతులకు వస్తున్నాయి' అని రఘు తెలిపారు.

Encouraging Innovation

English summary

ఆసియా యాప్ పోటీల్లో హైదరాబాదీ(ఫొటోలు) | Encouraging Innovation

This year, Uninor’s nominee for “The Best App in Asia” category of the digital winners 2014 is Raghu Kanchustambham, the founder and CEO, ConceptWaves for his mobile innovation ‘Livelihoods 360’.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X